భారీ స్కోరు చేధనలో తడబడుతున్న అసీస్ Australia still 120 runs behind in Hobart

Australia steady after day 3 still 120 runs behind in hobart

Buoyant South Africa enter new territory, Kyle Abbott, Hashim Amla, Vernon Philander, Steven Smith, Mitchell Starc, Australia v South Africa at Hobart, South Africa tour of Australia, Australia cricket, South Africa cricket, cricket, sports

South Africa had the first session with Quinton de Kock’s ton and Temba Bavuma’s 74 before Australia got back with quick wickets after lunch.

భారీ స్కోరు చేధనలో తడబడుతున్న అసీస్

Posted: 11/14/2016 06:02 PM IST
Australia steady after day 3 still 120 runs behind in hobart

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజున సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును సాధించారు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటకు వరుణుడు అటకం కల్గించాడు. అయితే వర్షం ఎడతెరపినివ్వడంతో మూడో రోజు అటను కొనసాగించిన సఫారీలలో డీకాక్ మళ్లీ చెలరేగిపోయాడు. లంచ్ విరామానికి ముందు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో వున్న సఫారీల సోర్కుబోర్డును 17 ఫోర్ల సాయంతో శతకాన్ని నమోదు చేసిన డికాక్ పరుగులెత్తించాడు. మరో క్రికెటర్ బావుమాతో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి దక్షిణాఫ్రికాను పటిష్టస్థితికి చేర్చాడు.

ఈ క్రమంలోనే బావుమా(74) హాఫ్ సెంచరీ సాధించాడు. 171/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా..ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. పూర్తిస్థాయి నిలకడతో దక్షిణాఫ్రికా పరిస్థితిని చక్కదిద్దింది.అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి డీకాక్ ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత బావుమా కూడా అవుటయ్యాడు. ఆ తరువాత ఫిలిండర్(32) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్  ఆరు వికెట్లు సాధించగా, స్టార్క్ కు మూడు వికెట్లు లభించాయి.

దీంతో దక్షిణాఫ్రికా అసీస్ పై తొలిఇన్నింగ్స్ లో 241 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా నిలకడగా రాణిస్తుంది. మూడో రోజు అటముగిసే సమయానికి 121 పరుగలు నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజా(56 బ్యాటింగ్), కెప్టెన్ స్టీవ్ స్మిత్(18 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(45) రాణించగా, బర్న్స్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. 79 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. బర్న్స్ డకౌట్ గా వెనుదిరగగా, వార్నర్(45) రెండో వికెట్ గా అవుటయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia vs south africa  philander  australia  cricket  

Other Articles