మెక్ గ్రాత్ పై రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు McGrath was the most difficult player, says Ricky Ponting

Glenn mcgrath was the most difficult player to captain says ricky ponting

ricky ponting, australia, glenn mcgrath, ricky ponting glenn mcgrath, australia captain ricky ponting, australia golden age, australia invincibles, glenn mcgrath, shane warne, cricket news, sports news

When asked who he found was the toughest player to skipper in his long tenure as captain of the Australia, Ricky Ponting pointed out Glenn McGrath.

మెక్ గ్రాత్ పై రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/06/2016 01:54 PM IST
Glenn mcgrath was the most difficult player to captain says ricky ponting

ఆస్ట్రేలియా క్రికెట్లో రికీ పాంటింగ్, మెక్ గ్రాత్ల జోడీ అ దేశ జట్టును విజయాల వైపు మళ్లించిన ఘటనను అనేకం. వీరిద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుకు అనేక చిరస్మరణీయమైన విజయాలను అందించారు. అదే క్రమంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున పాంటింగ్(13,378) అత్యధిక పరుగులను నమోదు చేస్తే.. మెక్ గ్రాత్(563) అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్గా ఘనత సాధించాడు. మరోవైపు రెండు వరుస వన్డే వరల్డ్ కప్లు పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా సాధిస్తే,  వరుస మూడు వరల్డ్ కప్లను సాధించిన జట్టులో మెక్ గ్రాత్ సభ్యుడిగా ఉన్నాడు.

అయితే మెక్ గ్రాత్కు కెప్టెన్ లకు పరీక్ష లాంటి వాడని, అతడ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమని అన్నాడు పాంటింగ్. మీ కెప్టెన్సీలో మీరు చూసిన అత్యంత కఠినమైన ఆటగాడు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన మెక్ గ్రాత్ పేరును వల్లించాడు. మెక్ గ్రాత్ జట్టులో వున్నప్పుడు నాయకత్వ బాధ్యతలను నిర్వహించడం చాలా కష్టమని ఆయన అన్నారు. మెక్ గ్రాత్ ను నడిపించడం చాలా సులువని అందరూ భావిస్తారని, అయితే అందులో కొంత వరకే నిజముందని అయన చెప్పాడు.

బౌలర్ గా అతనికి బంతినిచ్చిన మరుక్షణంలో మెక్ గ్రాత్ తన పని సమర్ధవంతంగా నిర్వహిస్తాడని, కాకపోతే కొన్ని సందర్భాల్లో మెక్ గ్రాత్ కు బంతి ఇవ్వన్నప్పుడు కూడా తానే బంతిని వేసేందుకు ముందుకోస్తాడని రికీ పాటింగ్ చెప్పాడు. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న సమయాల్లో.. బంతి ఇవ్వడానికి వేరే బౌలర్ ను పిలిచినా, అతన్నే పిలుస్తున్నట్లు భావించేవాడన్నాడు. దాంతో అతన్ని ప్రత్యేకంగా సముదాయించాల్సి వచ్చేదని, తన నాయకత్వంలో తనకు ఎదురైన అత్యంత కఠినమైన ఆటగాడు మెక్ గ్రాతేనని పాంటింగ్ సరదాగా తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Glenn McGrath  difficult player  captain  Ricky Ponting  Australia  cricket  

Other Articles