పెర్త్ టెస్టు: మూడవ రోజు సఫారీల భారీ స్కోరు Steve Smith's side staring at defeat in Perth

South africa bat australia into submission on day three in perth

Australia, Australia vs South Africa, Cricket, Dale Steyn, Faf du Plessis, Kagiso Rabada, Mitchell Starc, South Africa, South Africa vs Australia, Steve Smith, Test cricket, Australia cricket, south africa cricket, cricket, cricket news, sports, sports news

Elgar and Duminy did what Australia could not, scoring marathon tons as they batted for the first two sessions to ram home the advantage gained by South Africa's bowlers.

పెర్త్ టెస్టు: మూడవ రోజు సఫారీల భారీ స్కోరు

Posted: 11/05/2016 07:09 PM IST
South africa bat australia into submission on day three in perth

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. 104/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 390 పరుగులు చేసింది. దాంతో సఫారీలకు 388 పరుగుల ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీన్ ఎల్గర్(127;316 బంతుల్లో 17 ఫోర్లు,1 సిక్స్), జేపీ డుమినీ(141;225 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్)లు శతకాలు మెరిశారు.

ఈ రోజు రెండో సెషన్ వరకూ ఆసీస్పై పూర్తి ఆధిపత్యం కనబరిచిన దక్షిణాఫ్రికా.. టీ విరామం తరువాత పలు కీలక వికెట్లను నష్టపోయింది. ఎల్గర్ తో కలిసి మూడో వికెట్కు 250 పరుగులు జోడించిన తరువాత డుమినీ మూడో వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం స్వల్ప వ్యవధిలో ఎల్గర్ కూడా పెవిలియన్ కు చేరాడు. అయితే ఆపై డు ప్లెసిస్(32) ఫర్వాలేదనిపించగా, బావుమా(8) నిరాశ పరిచాడు. డీ కాక్(16 బ్యాటింగ్), ఫిలిండర్(23 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్ , సిడెల్లకు తలో రెండు వికెట్లు దక్కగా,స్టార్క్, మిచెల్ మార్ష్లకు చెరో వికెట్ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : perth test  australia vs south africa  south africa  australia  Cricket  

Other Articles