లేటయినా.. లేటెస్టు క్యాచ్ పట్టిన అమిర్ Mohammad Amir take a dazzling catch to dismiss bravo

Mohammad amir take a dazzling catch to dismiss bravo

Pakistan, pacer Mohammad Amir, dazzling catch, west indies, darren bravo, Pakistan vs West Indies, Spot-fixing scnadal, Mohammad Asif, Darren Bravo, cricket, cricket news, sports, sports news

The brilliant display of athleticism gave Mohammad Amir, who is making a comeback to Test cricket, his first catch in the long format.

లేటయినా.. లేటెస్టు క్యాచ్ పట్టిన అమిర్

Posted: 11/01/2016 10:07 PM IST
Mohammad amir take a dazzling catch to dismiss bravo

పాకిస్థాన్ క్రికెటర్‌ మహ్మద్ ఆమిర్‌ గుర్తున్నాడా..? ఆ మధ్య ఫిక్సింగ్ అరోపణలతో అంతర్జాతీయ క్రికెట్ సహా దేశీయ క్రికెట్ నుంచి వైదోలగి మళ్లీ పాక్ జాతీయ జట్టులోకి పునరాగమని చేసిన పాకిస్థాన్ పేస్ బౌలర్. గుర్తుకోచ్చాడా. అమిర్ తాజాగా మరో ఘనత సాధించాడు. అదేంటంటే లేటుగా అయినా లెటెస్టుగా అన్న తరహాలో లేటుగా అద్భుత క్యాచ్ పట్టుకున్నాడు. అదేంటి అంటరా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అమీర్ ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడేళ్ల కెరీర్‌ కూడా ఉంది. అయితే టెస్టు ఫార్మాట్లో ఇంతకుముందు ఒక్క క్యాచ్ కూడా పట్టుకోలేకపోయాడు. షార్జాలో వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆమిర్‌ తన కోరికను ఎట్టకేలకు తీర్చుకున్నాడు. ఆమిర్‌ అందుకున్నది తొలి క్యాచే అయినా అద్భుతం చేశాడు.పాక్‌ బౌలర్‌ జుల్ఫికర్ బాబర్‌ బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్మన్‌ డారెన్ బ్రావో షాట్ ఆడబోయాడు.

సర్కిల్‌ లోపల ఫీల్డింగ్‌ చేస్తున్న ఆమిర్‌ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఆమిర్ బంతి పట్టుకున్న సమయంలో పూర్తిగా గాల్లో ఉన్నాడు. అతని శరీరం ఎక్కడా గ్రౌండ్‌కు టచ్ కాలేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు క్లిక్మనిపించారు. టెస్టు క్రికెట్లో ఇంత ఆలస్యంగా తొలి క్యాచ్‌ పట్టిన క్రికెటర్‌ ఆమిరే. షార్జా టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 281 పరుగులు చేయగా, వెస్టిండీస్ 337 పరుగులు చేసింది.ఈ ఏడాది జనవరిలో ఆమిర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  pacer Mohammad Amir  dazzling catch  west indies  darren bravo  cricket  

Other Articles