ధోని సేన ధరించిన జెర్సీల పేర్లు ఎవరివీ..? Indian cricketers wear mothers' names on their jerseys

India cricket team wear mother s names on jerseys to support gender equality

India vs New Zealand, 5th ODI, Vizag, India, India news, India cricket, India cricket team, Cricket, India sports, India sports news, India cricket moms, India gender equality, Virat, Kohli, Virat Kohli, MS, Dhoni, MS Dhoni, Ajinkya, Rahane, Ajinkya Rahane, Rohit, Sharma, Rohit Sharma Teamindia, new zealand,Cricket, sports

Indian cricketers on sported their mothers’ names on their jerseys to applaud their role in shaping their careers in a campaign to change attitudes towards women in the patriarchal country.

ధోని సేన ధరించిన జెర్సీల పేర్లు ఎవరివీ..?

Posted: 10/30/2016 11:13 AM IST
India cricket team wear mother s names on jerseys to support gender equality

పర్యాటక జట్టు న్యూజిలాండ్తో విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా జరిగిన ఐదో వన్డేలో టీమిండియా క్రికెటర్లు ఢిఫెరెంట్ గా కనిపించారు. అదేంటి అంటారా..? విశాఖ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సహా బ్యాటింగ్కు వచ్చిన క్రికెటర్ల జెర్సీలపై ఎప్పుడూ లేనివిధంగా కొత్త పేర్లు కనిపించాయి. సాధారణంగా క్రికెటర్లు ధరించే జెర్సీలపై వారి సొంత పేర్లు ఉంటాయి. విశాఖ మ్యాచ్లో మాత్రం భారత క్రికెటర్లందరి జెర్సీలపైనా మహిళల పేర్లు ఉన్నాయి. వారి జెర్సీలపై వున్న మహిళల పేర్లేంటి..? అన్న డౌట్స్ కూడా రేకెత్తుతున్నాయి.

ఆటగాళ్ల జెర్సీపై ఉన్న పేరు వారి తల్లి పేరు. తమ జీవితాల్లో అమ్మకు ఉండే ప్రాధాన్యాన్ని చెప్పడానికి క్రికెటర్లు ఇలా చేశారు. భారత క్రికెట్ బోర్డుతో కలసి స్టార్ ఇండియా చేపట్టిన మహిళల సాధికారిత ప్రచార కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్లు తమ తల్లి పేరును జెర్సీపై వేయించుకున్నారు. సామాజిక మార్పు కోసం ఓ టీమ్ జర్సీని వాడటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ చెప్పారు. తమ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన బీసీసీఐ, భారత క్రికెటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teamindia  jerseys  jersey names  new zealand  India vs New zealand  cricket  

Other Articles