కెప్టెన్, కోహ్లీలపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు Virat Kohli's Mind is Like a Computer says Sunil Gavaskar

Virat kohli s mind is like a computer says sunil gavaskar

virat kohli, sunil gavaskar, ms dhoni, india, teamindia, new zealand, india vs new zealand, ind vs nzl, ind vs nzl mohali, cricket

Virat Kohli's 154* against New Zealand was his 26th century, a tally which he has made playing cricketing shots, according to former India captain Sunil Gavaskar

కెప్టెన్, కోహ్లీలపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు

Posted: 10/25/2016 04:24 PM IST
Virat kohli s mind is like a computer says sunil gavaskar

పర్యాటక జట్టు న్యూజిలాండ్తో మొహాలీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ ఇన్నింగ్ తో రాణించగా, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన దూకుడుతో శతకాన్ని నమోదు చేయడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వారిపై ప్రశంసలు జల్లు కురిపించారు.కోహ్లిలోనే కచ్చితత్వమే అతని బ్యాటింగ్ను స్థాయిని అమితంగా పెంచిందని కొనియాడాడు. కోహ్లి మైండ్ ను కంప్యూటర్ చిప్ తో పోల్చిన అతను మూడో వన్డేలో ఆతడి ఇన్నింగ్స్ కు ఇదే ఉదాహరణ అని గవాస్కర్ తెలిపాడు.  

సాధారణంగా పీల్డ్ లేని చోట బంతులను కోట్టేందుకు బ్యాట్స్ మెన్లు ప్లేస్ మెంట్ చూసి షాట్లు కోడుతుంటారని, కానీ ఫీల్డర్లను మోహరించిన చోట కూడా అతని కచ్చితమైన కొలతలతో కొట్టే షాట్లు ఫీల్డర్లనే అయోమయంలో నెడుతుంటాయి. ఆ రకమైన ఆట తీరే అతను భారీ స్కోర్లు సాధించడానికి ఉపయోగపడుతుందని గవాస్కర్ తెలిపాడు. దాంతో పాటు క్రికెట్ ఫీల్డ్లో కోహ్లి ప్రవర్తించే తీరు చాలా హుందాగా ఉంటుందన్నాడు. అభిమానుల్ని, ప్రజల్ని ఆప్యాయంగా పలకరించే తీరే అతనిలో మానవీయ లక్షణాలను తెలుపుతుందన్నాడు. ప్రస్తుత క్రికెట్ లో యువ క్రికెటర్లకు కోహ్లి ఒక రోల్ మోడల్ అని గవాస్కర్ పేర్కొన్నాడు.

అటు ధోని కూడా బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ను చేశాడన్నాడు. 'ధోని నాల్గో స్థానంలో బ్యాటింగ్ రావడానికి అతనే కారణం. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ లో వెనుకబడిపోతామనే విషయం ధోనికి తెలుసు. ఆ స్థానంలో బ్యాటింగ్ రావాల్సి ఉన్న మనీష్ పాండే, కేదర్ జాదవ్లు టాలెంట్ ఉన్న క్రికెటర్లే. కానీ వారికి అనుభవం తక్కువ. దాంతో ఆస్థానంలో బ్యాటింగ్ కు రావాలని ధోని తీసుకున్న నిర్ణయం సరైనదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

2011లో వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కూడా ధోని ఇలానే ముందుకు వచ్చాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ రావాల్సిన యువరాజ్ ను పక్కకు పెట్టి, ధోని వచ్చాడు. పటిష్టమైన శ్రీలంక ఎటాక్ ను ఎదుర్కొనే క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చాడు. న్యూజిలాండ్ తో మూడో వన్డేలో కూడా ఆనాటి ధోని కనిపించాడు. అప్పటి బాధ్యత ధోనిలో మరోసారి కనిపించింది' అని గవాస్కర్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  mahendra singh dhoni  india  new zealand  

Other Articles