పింక్ బాల్ పై విమర్శలను తిప్పికోట్టిన డీ కాక్ De Kock plays down pink ball effect

Didn t find any difference in pink ball cricket says de kock

South Africa quicks rout CA XI before lights come on, De Kock smashes ton against pink ball, Quinton de Kock, Kyle Abbott, Cricket Australia XI v South Africa at Adelaide, South Africa tour of Australia, Australia cricket, South Africa cricket

South Africa's batsmen spent 133.5 overs facing the pink ball and their centurion Quinton de Kock explained that it was not as tricky as they thought it would be.

పింక్ బాల్ పై విమర్శలను తిప్పికోట్టిన డీ కాక్

Posted: 10/25/2016 05:33 PM IST
Didn t find any difference in pink ball cricket says de kock

డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం సిద్దం చేసిన పింక్ బాల్ పై పలు విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్ వాటిని తోసిపుచ్చాడు. పింక్ బాల్ తో అడుతున్న క్రమంలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో డీ కాక్ ఏకంగా 17 ఓవర్లు అడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన క్రమంలో ఆయన అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. డే అండ్ నైట్ లో ఉపయోగించే పింక్ బంతికి, డే మ్యాచ్ల్లో ఉపయోగించే బంతికి తేడా ఏమీ కనిపించలేదన్నాడు.

మ్యాచ్ అనంతరం పింక్ బాల్పై డీ కాక్ మాట్లాడుతూ.. బంతి ఏదైనా బంతే.  పరిస్థితులన్ని బట్టి తాను ఆడతానన్నాడు. తన వరకూ పింక్ బాల్తో ఇబ్బంది అనిపించలేదని డీ కాక్ పేర్కొన్నాడు. అసలు దాని గురించి కూడా తాను పెద్దగా ఆలోచించలేదన్నాడు. ఇదిలా ఉండగా, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి పింక్ బాల్ పని తీరును అంచనా వేయొద్దన్నాడు. తాను క్రీజ్లోకి వెళ్లిన తరువాత డకౌట్ అయినా, సెంచరీ చేసినా అది బాల్ మార్పుతో వచ్చిన ఫలితం కాదన్నాడు. వనంబర్ 24న ప్రారంభంకానున్న పింక్ బాల్ డే నెట్ టెస్టు మ్యాచ్ లో భాగంగా సఫారీలు పింక్ బాల్ తో ప్రాక్టీసు మ్యాచ్ అడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pink ball  de Kock  australia  south africa  adelaide test  cricket  

Other Articles