ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో డీఆర్ఎస్ పరీక్ష DRS: BCCI warms up to MIT-approved technology

Bcci to implement drs on trial basis in india england tests

bcci, icc, hawk eye, bcci icc meeting, anurag thakur, thakur, anil kumble, kumble, india cricket, drs, cricket news, sports news, sports, cricket

BCCI officials attended a meeting with ICC and Hawk Eye representatives, who made a detailed presentation of the upgraded version of Decision Review System (DRS)

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో డీఆర్ఎస్ పరీక్ష

Posted: 10/21/2016 06:40 PM IST
Bcci to implement drs on trial basis in india england tests

అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని పరీక్షించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. త్వరలో ఇంగ్లండ్తో జరిగే  టెస్టు సిరీస్లో డీఆర్ఎస్ను పరీక్షించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా డీఆర్ఎస్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన వీడియో ప్రజెంటేషన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు చూపించింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన తరువాత బీసీసీఐ అందుకు ఆమోదం తెలిపింది.

'మెరుగుపరిచిన డీఆర్ఎస్పై సంతోషంగా ఉన్నాం.  ఇంగ్లండ్తో టెస్టు సిరీస్తో డీఆర్ఎస్ను పరీక్షిస్తాం. దాని పనితీరు ఎలా ఉంది. ఆ పద్ధతి ఎంతవరకూ సఫలీకృతం కానుంది అనేది రాబోవు టెస్టు సిరీస్లో పర్యవేక్షిస్తాం.  ప్రత్యేకంగా ఎల్బీ డబ్యూ నిర్ణయాల్లో డీఆర్ఎస్ పాత్ర పెద్దది. ఎల్బీని నిర్దారించే విషయంలో బంతి ఎంతవరకూ బ్యాట్స్మన్ ప్యాడ్ ను తాకింది అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో భాగంగా అల్ట్రా మోషన్ కెమెరాలను ఉపయోగించనున్నారు' అని బీసీసీఐ అధ్యక్షడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  ICC  team india  india vs england  test series  England  cricket  

Other Articles