భారత్-అసీస్ క్రికెట్ సిరీస్ కు షెడ్యూల్డ్ ఖారారు India-Australia Test series to begin from February 23

India australia four match test series from february 23

india vs australia, ind vs aus, india vs australia schedule, ind vs aus fixtures, ind vs aus 2017, india vs australia test series, india cricket schedule, india cricket fixtures, sports news, sports, cricket

India's four match Test series at home against Australia will begin with first Test in Pune from February 23.

భారత్-అసీస్ క్రికెట్ సిరీస్ కు షెడ్యూల్డ్ ఖారారు

Posted: 10/21/2016 06:10 PM IST
India australia four match test series from february 23

వచ్చే ఏడాది ఆరంభంలో భారత-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న నాలుగు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. దాదాపు నెలరోజులకు పైగా జరిగే సుదీర్ఘ టెస్టు సిరీస్ షెడ్యూల్ వివరాలను భారత-ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ టెస్టు సిరీస్ కోసం వేదికలను ఇప్పటికే ఖారారు చేసి వాటి వివరాలను తెలిపిన బిసిసిఐ తాజాగా తేదీలను కూడా ప్రకటించింది.

క్రికెట్ అస్ట్రేలియాతో చర్చించిన తరువాత టెస్టు సిరీస్ లోని నాలుగు మ్యాచ్ ల తేదీలను ఖరారు చేసి ప్రకటించింది. ఆస్ట్రేలియా చివరిసారి 2013లో భారత్ లో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు ఇరు జట్ల  మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగ్గా, ఆ సిరీస్ను భారత్ 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తరువాత 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియాలో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో భారత్ వైట్ వాష్ అయ్యింది.

షెడ్యూల్ ఇదే:

తొలి టెస్టు         ఫిబ్రవరి 23న     ఫూణే         మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం
రెండో టెస్టు:      మార్చి 4న         బెంగళూరు         చిన్నస్వామి స్టేడియం
మూడో టెస్టు:     మార్చి 16         రాంచీ         జెఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియం
నాల్గో టెస్టు         మార్చి 25        ధర్మశాల        హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bcci  australia  team india  india vs australia  cricket  

Other Articles