ఉత్కంఠభరిత పోరులో ఆరు పరుగులతో కివీస్ విజయం NZ beat India by six runs despite Pandya heroics

New zealand score first win of tour beat india by 6 runs in second odi

india vs new zealand, india vs new zealand statistics, india vs nz stats, india new zealand stats, team india, one day cricket, Martin Guptill, Umesh Yadav, Cricket, Sports, India, India vs New Zealand, Cricket News, Kane Williamson, Century, Sports Update, Match Update, Score Update

India today fell short of six runs while chasing a target of 243 runs against New Zealand in the second One Day International at Delhi's Ferozshah Kotla stadium.

ఉత్కంఠభరిత పోరులో ఆరు పరుగులతో కివీస్ విజయం

Posted: 10/20/2016 10:53 PM IST
New zealand score first win of tour beat india by 6 runs in second odi

ఢిల్లీలోని ఫిరోజ్ షా కో్ట్లా స్టేడియం వేదికగా పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది, రెండు జట్ట మధ్య చివరి వరకు విజయం దోబుచులాడితూ.. తీవ్ర ఉత్కంఠ భరితంగా మ్యాచ్ కొనసాగింది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కివీస్ ను 242/9 పరుగుల కట్టడి చేసింది. కివీస్ బ్యాట్స్ మన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 128 బంతుల్లో 118 పరుగులు చేశాడు.

అనంతరం 243 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఇన్నింగ్స్ 21 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(15) కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత స్కోరు బోర్డు నత్త నడకన కదిలింది. విరాట్ కోహ్లీ(9), అజింక్యారహానే(28), మనీశ్ పాండే(19)లు కూడా త్వరగా ఔట్ అవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది.

ఆ తర్వాత 73/4 వద్ద క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని, కేదార్ జాదవ్ లు చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ దశలో జాదవ్(41) అనవసర షాట్ కు యత్నించి 139/5 వద్ద కీపర్ క్యాచ్ గా వెనుదిరగాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యనికి తెరపడింది. జాదవ్ ఔటయిన తర్వాత ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యాను వరుసలో వెనుకకు పంపి అక్షర్ ను క్రీజులోకి తీసుకువచ్చాడు ధోని. ఆచితూచి ఆడుతూ అక్షర్ పటేల్ తో కలిసి తిరిగి స్కోరును ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో టిమ్ సౌథీ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి 172/6గా ధోని వెనుదిరిగాడు.

దీంతో్ న్యూజిలాండ్ తిరిగి మ్యాచ్ పై పట్టు దొరికినట్లయింది. ఆ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఇండియా చేజారిపోయే దశకు చేరింది. అప్పుడ బ్యాటింగ్ కు వచ్చిన ఉమేశ్ యాదవ్, ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ తిరిగి ఇండియా చేతికి వచ్చినట్లు కనిపించింది. చివరి ఆరు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో పాండ్యా(36) క్యాచ్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రాను టిమ్ సౌథీ బౌల్డ్ చేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 236 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, గుప్తిల్ బంతితో నిప్పులు చెరిగారు. సౌథీ మూడు వికెట్లను పడగొట్టగా.. బౌల్ట్, గుప్తిల్ లకు చెరో రెండు, హెన్రీ, సాంట్నర్ లకు తలా ఓ వికెట్ దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  india vs new zealand  ferozshah kotla stadium  second odi  cricket  

Other Articles