ఆటలో ప్రత్యర్థి క్రికెటర్ల మధ్య వాడీవేడి వాగ్వాదం Tamim iqbal and Jos Buttler fighting on Handshake Moment

Tamim iqbal and jos buttler fighting on handshake moment

mashrafe mortaza, joe butler, joe butler england, mashrafe mortaza bangladesh, bangladesh mashrafe mortaza, mortaza bangladesh, bangladesh mortaza, bangladesh vs england, england vs bangladesh, ban vs eng, eng vs ban, cricket

England accused Bangladesh of giving Jos Buttler a verbal 'send-off' and then shoulder-barging at the post-match handshakes as the odi series boiled over in front of a partisan crowd.

ఆటలో ప్రత్యర్థి క్రికెటర్ల మధ్య వాడీవేడి వాగ్వాదం

Posted: 10/10/2016 03:45 PM IST
Tamim iqbal and jos buttler fighting on handshake moment

మూడు వన్డేల సిరీస్లో భాగంగా మిర్పూర్ లో జరిగిన రెండో వన్డేలో పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో- అతిథ్య జట్టు బంగ్లాదేశ్ తో క్రికెటర్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అవుటైన క్రమంలో బంగ్లాదేశ్ ఆటగాడు మొహ్ముదుల్లా పెవిలియన్ కు దారి చూపాడు. దాంతో ఆగ్రహానికి గురైన బట్లర్ రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు మీదుగా దూసుకొచ్చిన బట్లర్ తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా బంగ్లా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఒక దశలో బట్లర్ ను నిలువరించడానికి ఫీల్డ్ అంపైర్లు సైతం శ్రమించాల్సి వచ్చింది.

అదే సమయంలో క్రీజ్ లో ఉన్న వోక్స్ కూడా బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తజాతో  మాటల యుద్ధానికి దిగాడు. అప్పటికి వారి మధ్య చోటు చోసుకున్న రగడ ముగిసినా మ్యాచ్ ముగిసిపోయిన తరువాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించిన తరువాత ఆటగాళ్లను అభినందించే కార్యక్రమంలోబంగ్లా ఆటగాడు తమీమ్ తో వైస్ కెప్టెన్ బెన్  స్టోక్స్  గొడవకు దిగేంత పని చేశాడు. కాగా,  సహచర ఆటగాళ్లు అక్కడ ఉండటంతో వారు మాటలతోనే తమ ఆవేశాన్ని చూపించుకున్నారు.

బంగ్లా బౌలర్ తస్కిన్ బౌలింగ్ లో బట్లర్ ఎల్బీగా అవుట్ కావడమే గొడవకు ప్రధాన కారణమైంది. తొలుత బట్లర్ అవుటంటూ బంగ్లా ఆటగాళ్ల చేసిన అభ్యర్ధనను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. ఆ తరువాత బంగ్లాదేశ్ రివ్యూ కోరడం, ఆపై బట్లర్ ఎల్పీడబ్యూగా అవుటైనట్లు ప్రకటించడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆనందంలో తేలిపోయారు. ఇదే సమయంలో బట్లర్కు పెవిలియన్ కు దారి చూపెడుతూ కొంతమంది బంగ్లా ఆటగాళ్లు సైగ చేశారు. దీనికి బట్లర్ తీవ్రంగా స్పందించడంతో వాగ్వాదానికి కారణమైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ 57 పరుగులు సాధించాడు. కాగా, బంగ్లానే విజయం వరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mashrafe mortaza  joe butler  england  bangladesh  clash  one day series  mirpur  cricket  

Other Articles