రెండో వన్డేలో ఇంగ్లాండ్ కు షాకిచ్చిన ప్రత్యర్థులు Bangladesh 34-run win over England in 2nd ODI

All round mashrafe mortaza leads bangladesh to 34 run win over england in 2nd odi

mashrafe mortaza, mashrafe mortaza bangladesh, bangladesh mashrafe mortaza, mortaza bangladesh, bangladesh mortaza, bangladesh vs england, england vs bangladesh, ban vs eng, eng vs ban, cricket

Mashrafe Mortaza (44 and 4/29) starred with both bat and ball as Bangladesh levelled the series with 34-run win in 2nd ODI.

రెండో వన్డేలో ఇంగ్లాండ్ కు షాకిచ్చిన ప్రత్యర్థులు

Posted: 10/10/2016 02:43 PM IST
All round mashrafe mortaza leads bangladesh to 34 run win over england in 2nd odi

మూడు వన్డేల సిరీస్లో భాగంగా అతిథ్య జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్కు షాక్ తగిలింది. క్రికెట్ కు పుట్టినిల్లుగా పేర్కోన ఇంగ్లాండ్.. అతిధ్య జట్టు బంగ్లాదేశ్ విసిరిన 239 పరుగుల విజయలక్ష్య ఛేదినలో చతికిలబడింది. కేవలం 204 పరుగుల స్కోరు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బంగ్లా పేస్ బౌలర్ల అటాక్ కు విలవిల్లాడిన ఇంగ్లండ్ 44.4 ఓవర్లలో కుప్పకూలింది. బంగ్లా బౌలర్లు మష్రాఫ్ మోర్తజా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, మరో పేసర్ తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.

ఇంగ్లండ్ 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో బెయిర్ స్టో(35), బట్లర్(57)లు రాణించడంతో కాస్త తేరుకున్నట్లు కనిపించింది. కాగా, వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇంగ్లండ్ మిగతా ఆటగాళ్లలో రషిద్(33 నాటౌట్), బాల్(28) మోస్తరుగా రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో మొహ్మదుల్లా(75), మోర్తజా(44)లు రాణించారు. ఈ తాజా విజయంతో బంగ్లాదేశ్ సిరీస్ ను 1-1 తో సమం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mashrafe mortaza  england  bangladesh  one day series  mirpur  cricket  

Other Articles