దానిని దాచిపెడితేనే.. బలం బయటపడుతుంది.. Never expose your weaknesses says Sachin Tendulkar

Never expose your weaknesses says sachin tendulkar

Sachin Tendulkar, Tendulkar, New Delhi Marathon, Indian cricket icon, Test cricket, cricket, cricket news, India, India vs New Zealand 2016, sports news, sports

Indian cricket icon Sachin Tendulkar said one should be smart enough to hide weaknesses against rival bowlers.

దానిని దాచిపెడితేనే.. బలం బయటపడుతుంది..

Posted: 10/08/2016 03:13 PM IST
Never expose your weaknesses says sachin tendulkar

సుమారుగా రెండు దశాబ్దాల పాటు భారత జాతీయ క్రికెట్ జట్టుకు సేవలందించి కొందరి అభిమానుల హృదయాలలో గాడ్ అఫ్ క్రికెట్ గా నిలిచిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ నేటి తరం క్రికెటర్లు మంచి సూచనలు చేశారు. ఏ మనిషికైనా బలం, బలహీనత ఉండటం సాధారణం. అయితే ప్రధానంగా ఆటగాళ్లు తమ బలహీనతల్ని కనబడనీయకుండా చేసినప్పుడే వారి బలం బయటపడుతుందని, దాంతోనే వారు విజయాలను అందకుంటారని చెప్పారు, దాంతో పాటు సవాళ్లను, కష్ట నష్టాలను ఎదుర్కొనడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని యువ క్రికెటర్లకు సచిన్ సూచించాడు.

ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించే న్యూఢిల్లీ మారథాన్ ఆరంభ కార్యక్రమానికి విచ్చేసిన సచిన్.. వర్ధమాను క్రికెటర్లకు పలు సూచనలు చేశాడు. 'ఎప్పుడూ మీ బలహీనతను బయటకు కనబడనీయకండి. ఒకసారి ప్రత్యర్థులకు మనం ఎక్కడ దొరికిపోతాయో తెలిసిందటే మళ్లీ మీరు తిరిగి పుంజుకోవడం కష్టమవుతుంది. ఒకసారి నా విషయంలో ఇదే జరిగింది. ఒకానొక సందర్భంలో నా పక్కటెములకు బంతి బలంగా తాకింది. అదే ఆయుధంగా బౌలర్ బంతుల్ని వేయడం మొదలు పెట్టాడు.

ఆ సమయంలో నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అక్కడ తీవ్ర గాయమైంది నాకు తెలుసు. కానీ ఆ విషయాన్ని బయటకు కనబడనీయలేదు. ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొనడం అలవాటు చేసుకోండి. ఒకసారి కష్టం వచ్చిందని ముందుకు ధైర్యంగా వెళ్లడం ఆపకండి' అని సచిన్ సూచించాడు. తన ఫిట్ నెస్ లో పరుగు అనేది కీలక పాత్ర పోషించిందని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendukar  india  batsmen  Advice  Team India  cricket  

Other Articles