ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న క్రికెటర్ Shakib Al Hasan and wife narrowly escape helicopter crash

Bangladesh cricketer escapes helicopter crash

Shakib Al Hasann, hasann wife Umme Ahmed Shishir, narrowly escape, helicopter crash, accident, bangladesh, Shakib Al Hasan helicopter crash, bangladesh all rounder, bangladesh cricketer, helicopter crash, Bangladesh, sports, sports news, cricket news, cricket

Star Bangladesh all-rounder Shakib Al Hasan said he was shocked to learn about the tragedy, in which one person was killed and four got injured.

హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న క్రికెటర్

Posted: 09/16/2016 08:51 PM IST
Bangladesh cricketer escapes helicopter crash

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, అల్ రౌండర్ షకీబల్ హాసన్ తృటితో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయన మాత్రమే కాదు.. ఆయన భార్య ఉమ్మె అహ్మద్ షిషిర్ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణించిన హెలికాప్టర్ వారు దిగిన కొద్ది సేపటికి గాలిలో వుండగానే సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలింది, దీంతో వారు ఛాపర్ ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నారు. ఢాకా నుంచి రాయల్ టులీప్ సీ రిసార్ట్కు షకీబల్ దంపతులను తీసుకెళ్లిన హెలికాప్టర్.. అక్కడ వారు దిగిన తర్వాత వెనుదిరిగిన కాసేపటికే కూలిపోయింది.

హెలికాప్టర్లో పైలట్ సహా ఐదుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.  తాను క్షేమంగా ఉన్నానని, అయితే ఈ వార్త వినగానే షాకయ్యానని షకీబల్ అన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను షూటింగ్లో ఉన్నానని చెప్పాడు. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ కోసం షకీబల్ తన భార్యతో కలసి రాయల్ టులీప్ సీ రిసార్ట్కు వెళ్లాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles