ప్రతిష్టాత్మక టెస్టుకు మాజీ కెప్టెన్లకు అహ్వానం.. BCCI to invite all former captains for '500th Test'

Bcci to invite all former captains for 500th test

bcci india, india bcci, bcci india cricket, Team India, former captains, virat kohli, Saurav ganguly, MS Dhoni, kapil dec, sunil gavaskar. 500th test match, india cricket board, india cricket team, indian cricket team, team india, india cricket, cricket news, cricket, sports, sports news

The BCCI and the UPCA are also preparing T-shirts with '500th Test' written on it for the under-privileged children.

ప్రతిష్టాత్మక టెస్టుకు మాజీ కెప్టెన్లకు అహ్వానం..

Posted: 09/16/2016 05:50 PM IST
Bcci to invite all former captains for 500th test

టీమిండియా క్రికెట్ ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టు మ్యాచ్కు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అద్భుత రీతిలో ఏర్పాటు చేస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. భారత్ ఈ నెల 22న కాన్పూరులో న్యూజిలాండ్‌తో మొదలయ్యే తొలిటెస్ట్‌కు సిద్ధమవుతుంది. ఇది టీమిండియాకు 500వ టెస్ట్. ఈ చారిత్రక మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీసీసీఐ భారత జట్టు మాజీ కెప్టెన్లు అందరినీ ఆహ్వానించాలని నిర్ణయించింది.

ఈ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు బోర్డు సీనియర్ అధికారి, ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం(యూపీసీఏ) అధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. మ్యాచ్ సందర్భంగా టాస్ వేసేందుకు ‘500వ టెస్ట్’ అని ముద్రించిన ప్రత్యేక వెండి నాణేన్ని ఉపయోగించనున్నారు. అలాగే భారత జట్టు మాజీ కెప్టెన్లు అయిన నారీ కాంట్రాక్టర్, చందూబోర్డే, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, శ్రీకాంత్ తదితరులను ఆహ్వానించి సన్మానించాలని బోర్డు భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles