తనకు నచ్చిన బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన యవరాజ్ Yuvraj Singh answers question without being diplomatic

Yuvraj singh answers question without being diplomatic

India cricket News,Yuvraj Singh,MS Dhoni,sourav ganguly,Yuvraj Singh India cricket,Sourav Ganguly vs MS Dhoni,best India captain,Yuvraj Singh reveals his best India captain,virender sehwag,zaheer khan, cricket, cricket news, sports news

Sourav Ganguly and MS Dhoni are two of the best captains India have ever produced, and they helped the nation become a strong force in world cricket during their reign.

తనకు నచ్చిన బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన యవరాజ్

Posted: 09/14/2016 07:14 PM IST
Yuvraj singh answers question without being diplomatic

యువరాజ్ సింగ్... డేర్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్. ఈ విషయం అందరికీ తెలిసిందే. టీమిండియా రెండో పర్యాయం ఐసీసీ వరల్డ్ కప్ గెలవడంతో కీలక భూమిక పోషించిన క్రీడాకారుడు కూడా యువరాజ్ అన్నడంలో సందేహమేమీ లేదు. అయితే అలాంటి క్రీడాకారుడు తనను ఇరాకాటంలో పెట్టే ప్రశ్నను ఎదుర్కోన్నప్పుడు చాకచక్యాంగా తన సమాధానాన్ని ఇవాల్సింది పోయి.. ఎలాంటి అలమరికలు లేకుండా తన మనసులోని మాటను నిర్మోహమాటంగా వెలిబచ్చాడు.

అటు గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా జట్టులోకి అడుగుపెట్టి.. ఆయన చేతుల మీదుగా చక్కని నైపుణ్యం గల బ్యాట్స్ మెన్ గానే కాకుండా అటు బౌలింగ్ లోనూ తన ప్రతిభను చాటిన యువరాజ్, ఇటు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రాటుదేలి ఎన్నో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి అల్ రౌండర్ ను ఇరకాటంలో పెట్టిన ప్రశ్న ఎదురైంది.  అ ప్రశ్న ఏంటంటారా..? మహేంద్ర సింగ్ ధోనీ, గంగూలీల్లో ఎవరు అత్యుత్తమ కెప్టెన్? అన్న ప్రశ్న తనకు ఎదురైన వేళ, ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చాడు.

రేడియో మిర్చి నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న యువీని ఈ ప్రశ్న అడుగగా, "సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో నా కెరీర్ ప్రారంభమైంది. అతను జట్టును ఒక తాటిపైనిలిపేవాడు. నేను ఒక్కడినే కాదు. సెహ్వాగ్, నెహ్రా, జహీర్, హర్భజన్ వంటి ఎందరినో ప్రోత్సహించాడు కాబట్టి అతనే బెస్ట్" అని సమాధానం ఇచ్చాడు. ధోనీతో తనకు ఎలాంటి గొడవలూ లేవని, అతను తనకు మిత్రుడేనని కూడా చెప్పుకొచ్చాడు. కాగా, 2011 వరల్డ్ కప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ, తన కుమారుడికి, తదుపరి అవకాశాలు రానీయకుండా చేసింది ధోనీయేనని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Best Indian Captain  Team India  Saurav ganguly  MS Dhoni  Yuvraj singh  cricket  

Other Articles