Sachin Tendulkar gets batting tips from little boy

Sachin tendulkar gets batting tips from little boy

Sachin Tendulkar, Sachin Tendulkar Twitter, little kid, batting tips, cricket, cricket news, sports, sports news

Sachin Tendulkar is never shy of sharing cricketing tips or his experience with youngsters and kids. He often makes his best effort to connect with his fans and followers.

క్రీకెట్ దేవుడికే బ్యాటింగ్ టిప్స్ నేర్పించిన బుడతడు

Posted: 09/02/2016 06:32 PM IST
Sachin tendulkar gets batting tips from little boy

అభిమానులకు ఆయన క్రికెట్ దేవుడు.. సహచర క్రికెటర్లకు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్.. నేటితరం క్రికెటర్లకు అయన  గురువర్యులాంటి వారు. సచిన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎందరో యువకులు అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు. సచిన్ ఎందరో క్రికెటర్లకు, చిన్నారులకు బ్యాటింగ్ టిప్స్ ప్పాడు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్తో తన అనుభవాలు పంచుకుంటుంటాడు. ఇవి చాలామందికి తెలిసిన విషయాలే. ఇటీవల బ్యాటింగ్ దిగ్గజానికి వింత అనుభవం ఎదురైంది. ఓ బుడతడు మాస్టర్కే బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు!

ఆ బాలుడు సచిన్కు విలువైన సలహాలు ఇచ్చాడట. బంతిపైనే మీ దృష్టి పెట్టండి.. అంటూ ఆ బుడతడు చెప్పడంతో ఆశ్చర్యపోవడం సచిన్ వంతైంది. ఈ విషయాన్ని సచినే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. ఆ బాలుడితో కలసి సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పటి ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా ఈ బాలుడు ఎవరు? అతనితో కలసి సచిన్ ఎప్పుడు బ్యాటింగ్ చేశాడు? వంటి విషయాలను వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  batting tips  little boy  twitter  cricket  

Other Articles