Sri Lanka set Australia 268 to in 1st test after Mendis 176

Starc snares six in sizzling test return

MA Starc, kusal mendis, kusal mendis score, kusal mendis test hundred, kusal mendis runs, kusal mendis sri lanka, kusal mendis sri lanka vs australia, dinesh chandimal, kusal mendis partnership, australia vs sri lanka, sri vs aus, sri vs aus, aus vs sri, cricekt, cricket score, cricket, sports news, sports

Australia's pace spearhead marked his return to the Test arena with six wickets for the match against Sri Lanka in Kandy

తొలి టెస్టులో అసీస్ విజయలక్ష్యం 268

Posted: 07/29/2016 06:59 PM IST
Starc snares six in sizzling test return

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా పయనిస్తున్న లంకేయులను అసీస్ బౌలర్ స్టార్క్ తన మాయాజాలంతో దెబ్బతీశాడు. 86 పరుగులకు నాలుగు వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో వున్న శ్రీలంకను ఐదవ వికెట్ కు దినేష్ చండీమల్ తో కలసి 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మెండీస్ ఒక్కడే కేవలం 169 పరుగులను సాధించగా, అ తరువాత నిలకడగా రాణిస్తున్న లంక బ్యాట్స్ మెన్లను స్టార్క్ పెవిలియన్ కు పంపించాడు.

దీంతో ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య శ్రీలంక 353 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి ఆసీస్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులు చేయగా,  ఆసీస్ తమ తొలిఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌటైంది. ఆరు వికెట్ల నష్టాకి 282 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజు బ్యాటింగ్ కు దిగిన లంకను స్టార్క్ మరోసారి దెబ్బతీశాడు.  అతిపిన్న వయస్సులో శతకాన్ని నమోదు చేసిన కుశఆల్ మెండిస్ ను త్వరగా పెవీలియన్ కు పంపించాడు.

మూడవ రోజు అట ముగిసే సమయానికి 169 పరుగుల సాధించిన మెండిస్ ను ఏడు పరుగులు జత కలపుగానే అంటే 176 పరుగుల వద్ద ఔట్ చేశాడు. మెండిస్ (254 బంతుల్లో 176 పరుగులు; 21 ఫోర్లు, 1 సిక్స్)ను  త్వరగానే ఏడో వికెట్ గా పెవిలియన్ బాట పట్టిన తరువాత చివర్లో హెరాత్(34 బంతుల్లో 35 పరుగులు; 6 ఫోర్లు ) రాణించడంతో లంక 350 మార్క్ చేరుకుంది. హెరాత్ ను హెజెల్వుడ్ ఔట్ చేయడంతో లంక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో హెజెల్వుడ్, నాథన్ లియోన్ చెరో రెండు వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Lanka  pallekele Test  Australia  Sri Lanka  MA Starc  cricket  

Other Articles