SLC complaint to Australia management over Muttiah Muralitharan behaviour

Murali and slc involved in war of words

Muttiah Muralitharan, Muttiah Muralitharan sri lanka, Muttiah Muralitharan australia, sri lanka vs australia, australia vs srilanka, sl vs aus, aus vs sl, australia tour of sri lanka, australia, sri lanka, sri cricket, australian cricket, cricket australia, Test series, cricket, cricket news, sports news, sports

SLC has protested to the Australian cricket team's management over the alleged highhandedness of spin legend Muttiah Muralitharan.

శ్రీలంక బోర్డు, మురళీధరన్ ల మధ్య మాటల యుద్దం..

Posted: 07/25/2016 09:24 PM IST
Murali and slc involved in war of words

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వైఖరిపై ఆ దేశ క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో భాగంగా పల్లెకిలా పిచ్ను రూపొందించే క్రమంలో మురళీధరన్ ఓవరాక్షన్ చేయడాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రంగా తప్పుబట్టింది.  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సలహాదారుగా ఉన్న మురళీధరన్..  శ్రీలంక క్రికెట్ మేనేజ్మెంట్ రూపొందించే పిచ్ల వ్యవహారంలో అనవసరపు జోక్యం చేసుకుంటున్నాడని మండిపడింది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్కు శ్రీలంక జట్టు ఫిర్యాదు చేసింది.
 
'తొలి టెస్టు జరిగే పల్లెకిలె స్టేడియంలో పిచ్ ను తయారు చేస్తున్నప్పుడు అక్కడకు వచ్చిన మురళీధరన్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ స్టేడియం నిర్వహాకులు మురళీని అడ్డుకున్నా వారిని తోసుకుంటూ లోనికి వచ్చాడు. ఈ క్రమంలో శ్రీలంక టీమ్ మేనేజర్ చరితా సేననాయకేతో తీవ్ర వాగ్విదానికి దిగాడు. ఒక జట్టుకు కన్సల్టెంట్గా ఉన్న వ్యక్తి, మరొక జట్టు పిచ్లు రూపొందించేటప్పుడు రావడం నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా మురళీ ప్రవర్తిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. మరొకసారి ఈ తరహా ఘటన జరగదని అనుకుంటున్నాం. మురళీ వైఖరితో చాలా నిరూత్సాహానికి గురయ్యాం'అని శ్రీలంక క్రికెట్ జట్టు అధ్యక్షుడు తిలంగా సుమితపాలా సీఏకు ఫిర్యాదు చేశారు. రేపట్నుంచి ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles