Our IPL dues are still pending, claims Sri Lankan great Muttiah Muralitharan

Muttiah muralitharan claims bcci owes him 400 000

Muttiah Muralitharan, BCCI, Kochi Tuskers, IPL, Mahela Jayawardene, mohammad shami, Brad Hodge, Team india, Indian cricketers, anil kumble, shikar dhawan, india cricket team, bcci cricket, cricket india, cricke news, cricket India

Srilankan legendary spinner Muttiah Muralitharan's allegation that the Indian board still owes Mahela Jayawardene and him $500,000 and $400,000.

బిసిసిఐ రెండున్నర కోట్ల రూపాయలు ఇవాల్సి వుంది..

Posted: 07/14/2016 08:06 PM IST
Muttiah muralitharan claims bcci owes him 400 000

భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తనకు, తన సహచర అటగాడికి కోట్ల రూపాయల డబ్బు చెల్లించాల్సి వుందని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు. నిదుల లేమి లేని బిసిసిఐ శ్రీలంక అటగాళ్లు డబ్బు చెల్లించాల్సి రావడం ఏమిటి..? అవునండీ తనకు రెండున్నర కోట్ల రూపాయలు(4 లక్షల డాలర్లు) బీసిసిఐ చెల్లించాల్సి ఉందని ముత్తయ్య మురళీదరన్ చెప్పాడు. అంతేకాదు తనతో పాటు తమ దేశానికి చెందిన మహేల జయవర్ధనేకు రూ. 3 కోట్లు ఇవాల్సి ఉందని వెల్లడించాడు.

గతేడాది గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ మొత్తానికి దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ మొహ్మద్ షమీకి రూ.2 కోట్ల, 23 లక్షల పరిహారాన్ని బీసీసీఐ అంజేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా పరిహారం ఇవ్వాలని కొచ్చి టస్కర్స్ టీమ్ సభ్యులు కోరుతున్నారు. 'షమీకి బీసీసీఐ పరిహారం ఇచ్చింది. అవకాశముంటే కొచ్చి టస్కర్స్ ఆటగాళ్లకు కూడా పరిహారం ఇవ్వాల'ని ఈ జట్టు తరపున ఆడిన ఆస్ట్రేలియ క్రికెటర్ బ్రాడ్ హొడ్జ్ ట్విట్టర్ ద్వారా కోరాడు.

దీని గురించి పలుమార్లు బీసీసీఐ అడిగినా ఫలితం లేకపోయిందని మురళీధరన్ చెప్పాడు. తాను చాలా లీగ్లు ఆడానని, బీసీసీఐ మాదిరిగా ఏ బోర్డు వ్యవహరించలేదని విమర్శించాడు. ఆటగాళ్లతో పాటు బోర్డు కూడా కాంట్రాక్టును గౌరవించాల్సిన అవసరముందన్నాడు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, సమస్య పరిష్కారమైన తర్వాతే ఆటగాళ్లు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్‌, రవీంద్ర జడేజా కూడా కొచ్చి టస్కర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muttiah Muralitharan  Brad Hodge  Kochi Tuskers players  BCCI  cricket  

Other Articles