Indian team fine irrespective of coach: Ex-Aussie bowler Jeff Thomson wades into head coach debate

India will be a fine team doesn t matter who becomes coach says jeff thomson

Jeff Thomson, Legendary Australian fast bowler, indian coach, foreigner coach, Shardul Thakur, India coach, india, australia, team india coach, BCCI, cricket news

Legendary Australian fast bowler Jeff Thomson feels it does not matter whether a foreigner or an Indian is made head coach as the national team will continue to be a strong side.

టీమిండియా కోచ్ విషయంలో రాజకీయాలు వద్దు..

Posted: 06/09/2016 08:38 PM IST
India will be a fine team doesn t matter who becomes coach says jeff thomson

టీమిండియా కోచ్ ఎవరైతే ఏంటని ఆస్ట్రేలియా దిగ్గజం జెఫ్ ధాంప్సన్ ప్రశ్నించాడు. కోచ్ విషయంలో తాను రాజకీయాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీమిండియా ప్రస్తుతం మంచి ఫేజ్ లో ఉందని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా ఆధిపత్యం మరికొన్నేళ్లు ఇలాగే కొనసాగుతుందని, అలాంటప్పుడు టీమిండియా కోచ్ ఎవరైతే ఏంటని ఆయన పేర్కొన్నాడు. అయితే కోచ్ ఎవరైనా రాజకీయ ప్రమేయం లేకుండా ఎంపికైతే బాగుంటుందని ఆయన సూచించాడు.

కోచ్ నియామకంలో ఏది ప్రభావితం చేస్తుందో తనకు తెలియదని, రాజకీయాలు మాత్రం ప్రభావితం చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డాడు. పలు సందర్భాల్లో కోచ్ స్వదేశీయా? విదేశీయా? అంటూ అనవసర చర్చలు లేస్తున్నాయని, అవి ఆరోగ్యకరం కాదని ఆయన అన్నాడు. జట్టు ప్రయోజనాలు కాపాడే వ్యక్తి ఎవరైనా కోచ్ కావచ్చని ఆయన తెలిపారు. టీమిండియా కోచ్ గా ఎవరు వచ్చినా పెద్ద తేడా ఉండదని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నాడు. విదేశాల నుంచి తమ వాళ్లు కూడా కొంతమందిని  కోచ్లగా నియమిస్తూ పెద్ద చర్చకు తెరలేపుతున్నారన్నాడు.  అసలు జాతీయ క్రికెట్ కోచ్ల నియామకం వెనుక ఏమి జరుగుతుందనేది తనకు తెలియదన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jeff Thomson  india  australia  team india coach  BCCI  cricket news  

Other Articles