IPL trophy will go along with my World Cup victories says Yuvraj Singh

Yuvraj rates ipl title as precious as world cup triumphs

IPL 2016 Final,Yuvraj Singh,srh,yuvraj reaction,Sunrisers Hyderabad,yuvraj ipl 2016 stats,Sunrisers Hyderabad IPL 2016 Champions,RCB vs SRH,ipl final,David Warner,srh bowlers

Yuvraj Singh had to miss the initial stages of his team's campaign in Indian Premier League due to injury.

ఐపీఎల్ కప్ ప్రపంచ కప్ తో సమానం

Posted: 05/31/2016 06:47 PM IST
Yuvraj rates ipl title as precious as world cup triumphs

తొమ్మిదో ప్రయత్నంలో ఐపీఎల్ ట్రోఫీ తన చేతుల్లోకి రావడం పట్ల టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ అమితానందం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లకు తన కోరిక తీరిందన్నాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్‌తో పాటు వన్డే, టి20 వరల్డ్ కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టులో ఉన్న యువరాజ్...ఐపీఎల్ టైటిల్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పాడు. ఐపీఎల్ కప్ కూడా తనకు ప్రపంచ కప్ తో సమానమని వ్యాఖ్యానించాడు. ‘నేను ప్రపంచకప్‌లు గెలిచినా ఐపీఎల్ ఒక్కసారి కూడా దక్కలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఆ క్షణం వచ్చింది. ఇదో గొప్ప అనుభూతి. ఇప్పుడు నా దృష్టిలో ఇది ప్రపంచకప్‌లతో సమానమైన విజయం’ అని యువీ అన్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్... ఐపీఎల్-9 టైటిల్ దక్కించుకోవడంలో తనవంతు పాత్ర పోషించిన యువరాజ్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో యువరాజ్ రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 38 (23 బంతుల్లో) పరుగులు చేశాడు. అద్భుతంగా ఫీల్డింగ్ చేసి మెరుపులు మెరిపించాడు. గత ఎనమిది పర్యాయాలుగా ఐపీఎల్ లో అడుతున్న ఒక్కసారి కూడా తన జట్టు ఫైనల్ లో గెలుపోందకపోవడంతో ఆయన ఇక ఐపీఎల్ కు దూరమవుతారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఈ ఎనమిదేళ్ల కాలంలో అయన పలు జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు. అయినా ఆయన ప్రాతినిధ్యం వహించిన జట్టు టైటిల్ ను సాధించలేకపోయింది. దీంతో ఆయన ఐపీఎల్ కప్ కూడా తనకు ప్రపంచ కప్ సాధించనంత ఆనందాన్ని ఇస్తుందని వ్యాక్యానించడాన్ని పలువురు క్రీడా ప్రముఖులు సమర్థించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016 Final  Yuvraj Singh  winning team member  sun risers hyderabad  cricket  

Other Articles