IPL: AB de Villiers pulls off a heist, RCB reach third final

Ab de villiers overwhelmed after rcb roar into final

ipl 2016, ipl, ipl play-offs, ab de villiers, de villiers batting, ab de villiers rcb, rcb vs gl, gujarat bangalore, Royal Challengers Bangalore,Virat Kohli,Gujarat Lions, RCB vs GL, Bengaluru, Qualifier 1,IPL 9,Cricket latest IPL 9 news

Great honour and privilege to be in IPL final, says AB de Villiers. RCB were left tottering at 29/5 when AB de Villiers chipped in with a match winning performance.

ఐపీఎల్ ఫైనల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్..

Posted: 05/25/2016 04:10 PM IST
Ab de villiers overwhelmed after rcb roar into final

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చివరి వరకు సాగిన ఉత్కంఠ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ చివరి తరుణంలో ప్లే ఆఫ్ దశకు చేరి.. ఫైనల్ లో బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలించింది. ఏబీ డివిలియర్స్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-9 ఫైనల్లోకి దూసుకెళ్లింది. కోహ్లి అరుదైన వైఫల్యాన్ని మరచిపోయేలా చేస్తూ అతను భారీ షాట్లతో చెలరేగడంతో తొలి క్వాలిఫయర్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. 2009 అనంతరం ఆ జట్టు ఐపీఎల్ తుది పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది.

గుజరాత్ లో కూడా టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్లు విఫలం కాగా, డ్వేన్ స్మిత్ ఒంటి చేత్తో (41 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి లయన్స్ కు గౌరవప్రదమైన స్కోరును దక్కేలా చేశాడు. వాట్సన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. డివిలియర్స్, ఇక్బాల్ అబ్దుల్లా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు 52 బంతుల్లోనే అభేద్యంగా 91 పరుగులు జోడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ధవల్ కులకర్ణి (4/14) ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల వీర సంబరాలు ఆర్‌సీబీ అద్భుత విజయాన్ని ప్రతిబింబించాయి. 2009లో సరిగ్గా ఇదే రోజు ఆర్‌సీబీ, డెక్కన్ చార్జర్స్ చేతిలో ఫైనల్లో ఓడింది.
 
సాధారణ లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు ఎవరూ ఊహించని రీతిలో టపటపా వికెట్లు కోల్పోయింది. మరో విధ్వంసానికి సిద్ధమయ్యాడని అనుకునే లోపే కోహ్లి (0) అరుదైన రీతిలో రెండో బంతికే డకౌట్ కావడంతో చిన్నస్వామి మైదానం చిన్నబోయింది. ధవల్ తన రెండో ఓవర్లో వరుస బంతుల్లో గేల్ (9), లోకేశ్ రాహుల్ (0)లను అవుట్ చేసి మరో షాక్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో వాట్సన్ (1)ను జడేజా వెనక్కి పంపించాడు. మళ్లీ చెలరేగిన ధవల్... సచిన్ బేబీ (0) పని పట్టడంతో బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో స్టువర్ట్ బిన్నీ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి డివిలియర్స్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 25 బంతుల్లో 39 పరుగులు జోడించారు. బిన్నీ అవుటైన తర్వాత అబ్దుల్లా అండతో డివిలియర్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరుకు అద్భుత విజయాన్ని అందించాడు.
 
స్కోరు వివరాలు:-
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) గేల్ (బి) అబ్దుల్లా 4; మెకల్లమ్ (సి) డివిలియర్స్ (బి) అబ్దుల్లా 1; రైనా (సి) అరవింద్ (బి) వాట్సన్ 1; కార్తీక్ (బి) జోర్డాన్ 26; డ్వేన్ స్మిత్ (సి) కోహ్లి (బి) చహల్ 73; జడేజా (సి) గేల్ (బి) వాట్సన్ 3; బ్రేవో (బి) వాట్సన్ 8; ద్వివేది (సి) కోహ్లి (బి) వాట్సన్ 19; ప్రవీణ్ (బి) జోర్డాన్ 1; కులకర్ణి (రనౌట్) 10; జకాతి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 158.
వికెట్ల పతనం: 1-2; 2-6; 3-9; 4-94; 5-107; 6-115; 7-145; 8-145; 9-156; 10-158.
బౌలింగ్: అరవింద్ 3-0-13-0; అబ్దుల్లా 4-0-38-2; వాట్సన్ 4-0-29-4; జోర్డాన్ 4-0-26-2; చహల్ 4-0-42-1; బిన్నీ 1-0-4-0.
 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) కులకర్ణి 9; కోహ్లి (బి) కులకర్ణి 0; డివిలియర్స్ (నాటౌట్) 79; రాహుల్ (సి) స్మిత్ (బి) కులకర్ణి 0; వాట్సన్ (సి) స్మిత్ (బి) జడేజా 1; సచిన్ బేబీ (సి) జకాతి (బి) కులకర్ణి 0; బిన్నీ (ఎల్బీ) (బి) జడేజా 21; అబ్దుల్లా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (18.2 ఓవర్లలో 6 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1-12; 2-25; 3-25; 4-28; 5-29; 6-68.
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 3.2-0-32-0; ధవల్ కులకర్ణి 4-1-14-4; జడేజా 4-0-21-2; జకాతి 3-0-45-0; బ్రేవో 3-0-26-0; స్మిత్ 1-0-14-0.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  IPL  Royal Challengers Bangalore  Gujarat Lions  RCB vs GL  Bengaluru  Qualifier 1  cricket  

Other Articles