Gayle blasts Chappell, Flintoff over sexism criticism

Gayle hits back at sexism critics

Chris Gayle, Ian Chappell, Chris Rogers, Andrew Flintoff, Australian cricketers, sexist behaviour, Big Bash League, australian journalist, IPL 2016, RCB, Cricket

Chris Gayle lashed out at former Australian cricketers Ian Chappell and Chris Rogers, who had targeted him over his sexist behaviour during the Big Bash League earlier in the year.

హలో..! నాకు నీతులు చెప్పోద్దు..

Posted: 05/24/2016 04:04 PM IST
Gayle hits back at sexism critics

టీవీ వ్యాఖ్యాతపై శృంగారపరమైన వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి వార్తల్లోకెక్కాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో తన ప్రవర్తనను తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లపై గేల్ సెటైర్ల వర్షం కురిపించాడు. ప్రధానంగా  ఇయాన్ చాపెల్,  క్రిస్ రోజర్స్, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఫ్లింటాఫ్‌లను లక్ష్యంగా చేసుకుని తన జీవిత కథగా రాబోతున్న 'సిక్స్ మెషీన్-ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్’ పుస్తకంలో పదునైన వ్యాఖ్యలతో మండిపడ్డాడు. తన పుస్తకంలో కొన్ని ప్రచురణలను గేల్ తాజాగా  వెల్లడించాడు.

క్రికెట్ ఆడేటప్పుడు వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాప్ తనకు నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. ఒక యువ క్రికెటర్ తరహాలో ఫీల్ అయ్యే ఫ్లింటాఫ్..తనకు ఉపన్యాసాలు ఇవ్వొద్దంటూ దుమ్ముత్తిపోశాడు. తనకు ఫ్లింటాప్ ఎప్పుడు బంతి వేసినా పాస్ట్ బ్యాక్ వర్డ్ పాయింట్ లో ఫోర్ గా వెళుతుందన్న సంగతి అతనికి తెలుసు అంటూ గేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాను టెస్టు మ్యాచ్ ఆడే విరామ సమయాల్లో ఆ తదుపరి రోజు ఫీల్డ్ లో చురుగ్గా కదలడం కోసం వయాగ్రా మాత్రలు తీసుకుంటానని గతంలో ఫ్లింటాఫ్ స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని గేల్ అస్త్రంగా చేసుకున్నాడు.

మరో ఆసీస్ క్రికెటర్ క్రిస్ రోజర్స్పై కూడా గేల్ మండిపడ్డాడు. గతంలో ఇద్దరం కలిసి బార్లలో గడిపిన క్షణాలను మరచిపోయావా?అని విమర్శించాడు. 'నువ్వు ఏమి మాట్లాడావో నాకు తెలుసు. ఈసారి మాట్లాడేటప్పుడు క్యారెట్ నములుతూ మాట్లాడు' అని హెచ్చరించాడు. ఇక ఆసీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ పై కూడా పదునైన విమర్శలు చేశాడు.  గతంలో వెస్టిండీస్ లో ఒక క్రికెట్ అధికారిని కొట్టి దోషివైన ఇయాన్ చాపెల్ తనను ప్రపంచ వ్యాప్తంగా నిషేధించాలంటూ వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గు చేటన్నాడు. అసలు తనపై నిషేధం విధించమని చెప్పడానికి చాపెల్ ఎవరని గేల్ తన పుస్తకంలో ప్రశ్నించాడు.

ఈ ఏడాది జనవరిలో బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్ సీజీ)లో మహిళా టీవీ ప్రజెంటర్ మెల్ మెక్ లాలిన్ తో గేల్ అసభ్యంగా మాట్లాడాడు. 10 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 4 లక్షల 75 వేల రూపాయలు) జరిమానా పడింది. అయితే ఆ అంశాన్ని  గేల్ తన పుస్తకంలో సరిదిద్దుకునే యత్నం చేశాడు. అది తాను జోక్ గా మాత్రమే మెక్ లాలిన్ తో అలా ప్రవర్తించానని గేల్ సమర్ధించుకున్నాడు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  chris gayle  west indies  australian journalist  Ian Chappell  Chris Rogers  Andrew Flintoff  

Other Articles