AB de Villiers, Kohli Virat Set Off Twitter Tsunami With IPL Blitz

Virat kohli ab de villiers hailed for record breaking show

Gujarat Lions,Royal Challengers Bangalore,Jos Buttler,David Warner,Chris Gayle, Yuvraj singh, Virat Kohli,AB de Villiers,IPL 9,Cricket

India's Virat Kohli struck a 55-ball 109 while South Africa's AB de Villiers scored an unbeaten 52-ball 129 to power the RCB to a record 144-run victory over the Gujarat Lions in IPL 2016

ఇద్దరూ ఇద్దరే.. పరస్పరం ప్రశంసలే..

Posted: 05/15/2016 03:02 PM IST
Virat kohli ab de villiers hailed for record breaking show

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలీర్స్ ఆడిన దూకుడు ఇన్నిగ్స్ను పలువురు క్రికెటర్లు ట్విట్టర్లో అభినందనలతో ముంచెత్తారు. కోహ్లీ 55 బంతుల్లో 109 పరుగులు చేస్తే, ఏబీ 52 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ఈ అపురూప ఇన్నింగ్స్ నమోదైంది. చివర్లో కోహ్లీ ఫోర్లు, సిక్సర్లతో విశ్వరూపం చూపాడు. మరోవైపు  ఏబీ కళ్లు చెదిరే భారీ షాట్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. వరుస బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ గుజరాత్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించాడు.

దీంతో రాయల్ చాలెంజర్స్ 249 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచగలిగింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్, గుజరాత్పై 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై  యువరాజ్ సింగ్, డారెన్ సామీ, మాజీ భారత క్రికెటర్ శ్రీకాంత్, ఆల్బే మోర్కెల్, హర్భజన్ సింగ్‌తో పాటూ పలువురు క్రికెటర్లు ఏబీ, కోహ్లీల ఇన్నింగ్స్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సంచలన ఇన్నింగ్స్పై విరాట్, డివిల్లీర్స్ ట్విట్టర్లో స్పందించారు.

'నీ బ్యాటింగ్ చూడటం, నీతో కలసి బ్యాటింగ్ చేయడాన్ని ఎప్పుడూ ఇష్టపడతా'.. అంటూ డివిల్లీర్స్ను ఉద్దేశించి విరాట్ ట్వీట్ చేశాడు. దీనికి ఏబీ స్పందిస్తూ.. 'నా ఫీలింగ్ కూడా అదే,  నీవు లెజెండ్'.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్గా రెండో అత్యధికం కావడం విశేషం. ఓ ఐపీఎల్ సీజన్లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక కోహ్లీ, ఏబీ చేసిన 229 పరుగుల భాగస్వామ్యం టి-20ల చరిత్రలోనే అత్యుత్తమం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  AB de Villiers  Twitter  

Other Articles