Sunil Gavaskar feels there is no rush to make Virat Kohli captain in all the three formats

Sunil gavaskar doesn t want virat kohli to be odi captain

Cricket News, Virat Kohli, Sunil Gavaskar, Sourav Ganguly, MS Dhoni, Team India Captain, Virat Kohli, Cricket India, 2019 World Cup, ms dhoni india captain, ganguly praises dhoni, Indian Cricket, Sourav Ganguly, Cricket

Legendary Indian captain Sunil Gavaskar feels Virat Kohli should not be rushed into captaincy in all formats.

కోహ్లీకి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అప్పుడే వద్దు..

Posted: 05/11/2016 08:06 PM IST
Sunil gavaskar doesn t want virat kohli to be odi captain

టీమిండియా టెస్టు కెప్టెన్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం అందరికన్నా అధికంగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. అసలు తన ఇష్టాఇష్టాలను ఎవరి చెప్పకున్నా.. ఆయనకు ఏది మంచో, ఎది చెడో, ఏది ఎప్పుడు అందించాలన్న అంశంపై అప్పుడే పెద్ద చర్చ జరుగుతుంది, ఆయనకు పరిమిత ఓవర్ల కెప్టెన్ పగ్గాలను అందిచాలని కోందరు, అప్పుడేనా వద్దని మరికోందరు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజగా ఆ జాబితాలోకి లెజండరీ క్రికెటర్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు. ఇప్పుడే పరిమితి ఓవర్ల క్రికెట్లో జట్టు పగ్గాలు అప్పగించరాదని ఆయన అభిప్రాయపడ్డాడు.

'అన్ని ఫార్మాట్లలోనూ విరాట్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించరాదు. కెప్టెన్ పాత్రలో అతన్ని ఎదగనివ్వండి. 2019 వన్డే ప్రపంచ కప్నకు ఇంకా చాలా సమయం ఉంది' అని గవాస్కర్ అన్నాడు. వచ్చే ప్రపంచ కప్ నాటికి వన్డే జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం మహేంద్ర సింగ్ ధోనీకి ఉండకపోవచ్చని మరో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అంతేగాక ధోనీ స్థానంలో వన్డే, టి-20 జట్లకు కోహ్లీని కెప్టెన్ చేయాలని సూచించాడు. టెస్టు క్రికెట్ కెప్టెన్గా విరాట్ రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పందించాడు. ఇప్పుడే కోహ్లీకి అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఒత్తిడి పెరుగుతుందన్నది సన్నీ అభిప్రాయం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  India captain  2019 World Cup  Virat Kohli  Sunil Gavaskar  Cricket  

Other Articles