Shah Rukh Khan, son AbRam in attendance as KKR rise to top of IPL 2016 table

Srk attends kkr match with abram showers kisses on fans

shahrukh khan, srk, shahrukh, abram khan, abram pics, abram photos, abram, kkr vs kxip, kxip vs kkr, kolkata vs punjab, punjab vs kolkata, kolkata knight riders, kkr shahrukh khan, kkr abram

Bollywood actor and KKR co-owner Shah Rukh Khan was present along with his son AbRam and the crowd cheered the actor as he was shown on the screen.

ఈడెన్ లో అరుదైన సీన్.. షారుఖ్ తో అభ్ రామ్ వాటర్ గేమ్స్

Posted: 05/05/2016 08:59 PM IST
Srk attends kkr match with abram showers kisses on fans

ఈడెన్ గార్డెన్స్ లో ఓ ఆసక్తికర సీన్ కనిపించింది. బాలీవుడ్ బాద్షా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ట యజమాని షారుక్ ఖాన్, తన చిన్న కుమారుడు అబ్ రామ్ తో కలిసి స్టేడియంలో కాసేపు సందడిచేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపు ముందు స్టేడియంలోని వీరిద్దరూ అడిన వాటర్ గేమ్స్ అడియన్స్ ను అకట్టుకున్నాయి. అంతేకాదు అబ్ రామ్ అని బిగ్గరగా కేకలు వేసేలా చేసింది. అసలు ఈ తండ్రీకొడుకులు చేసిన సందడి ఏంటంటారా..? అమ్మో అబ్ రామ్ చేసిన సందడి చెప్పనలవి కాదు.

ప్రేక్షకుల దృష్టిని అమాంతం చేరగోనేలా చేసిన ఈ తండ్రీకొడుకుల ప్రేక్షకులకు అదనపు అనందాన్ని అందించారు. ముఖ్యంగా కోల్ కతా జెర్సీ వేసుకుని మైదానంలోకి అబ్ రామ్ రాగానే స్టేడియం హోరెత్తిపోయింది. స్డేడియంలోని బిగ్ స్క్రీన్ పై అబ్ రామ్ కనిపించినప్పుడల్లా ఈ చిన్నారి పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు మైదానంలో చేసిన సందడి ఇప్పుడు వీడియో రూపంలో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా అబ్ రామ్ అంటూ ట్వీట్ చేశాడు షారుక్.

షారుక్, అబ్ రామ్ ఆడిన వాటర్ గేమ్ ను అందరూ ఆసక్తిగా చూశారు. తాగడానికి అబ్ రామ్ కు షారుక్ ఓ నీళ్ల బాటిల్ ఇచ్చాడు. దాన్ని తీసుకున్న అబ్ రామ్ కొన్ని నీళ్లు తాగి, మరికొన్ని నీళ్లు నోట్లో ఉంచుకుని తండ్రి వద్దకు వచ్చి అబ్ రామ్ బయటకు ఊదుతాడు. ఈ సీన్ చూసిన వారంతా అబ్ రామ్ పిల్లాడు కాదు చిచ్చర పిడుగు అని అనుకునేలా వుంది. ఇక తనయుడితో పోటీ పడిన షారుక్ కూడా చిన్న పిల్లాడిలా కొడుకు నుంచి బాటిల్ ను తీసుకుని.. కొడుకు చేసిన పనే చేశాడు.

ఈ సీన్ చూస్తున్న స్టేడియంలోని అభిమానులు విజిల్స్, పెద్ద పెద్ద అరుపులతో వీరిని ఎంకరేజ్ చేశారు. కొల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా వున్న షారుఖ్ ఆయన తనయుడు అబ్ రామ్ సందడికి ఈడెన్ గ్రౌండ్స్ సందడికి వేదికగా నిలిచింది. కాగా షారుక్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే తమ చేష్టలతో స్టేడియాన్ని హోరెత్తించి ఈ ఆటకు షారుక్, చిచ్చర పిడుగు అబ్ రామ్ మరింత ఊపు తీసుకువచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ పై కోల్ కతా విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రభాగన నిలిచింది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : criccket  bollywood  AbRam Khan  Shah Rukh Khan  Eden Garden  

Other Articles