Virat Kohli fined Rs 24 lakh for slow over-rate, Gautam Gambhir for kicking chair in dug out

Virat kohli gautam gambhir fined for breaching ipl code of conduct

gautam gambhir, gambhir, gambhir kkr, virat kohli, kohli, kohli rcb, kohli fined, gambhir kicks chair, rcb vs kkr, kkr vs rcb, bangalore vs kolkata, ipl 2016, ipl, cricket

Gautam Gambhir is fined 15 percent of his match fees for his conduct while Virat Kohli is fined Rs 24 lakh due to slow over-rate.

ఆ ఇద్దరు కెప్టెన్లు జరిమానా కట్టారు.. ఎందుకు..?

Posted: 05/05/2016 06:47 PM IST
Virat kohli gautam gambhir fined for breaching ipl code of conduct

మ్యాచ్ ఆఖరులో వివాదాస్సదంగా ప్రవర్తించిన గౌతం గంభీర్ కు, స్లో ఓవర్ రేట్ కారణంగా విరాట్ కోహ్లీలకు భారీ జరిమానా పడింది. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ.. అతిగా ప్రవర్తించి, కుర్చీని కాలుతో తన్నిన గంభీర్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించగా, కోహ్లీ బృందానికి రూ.66 లక్షల భారీ జరిమానా విధించారు.

ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య సోమవారం జరిగిన మొదటి మ్యాచ్ లో గంభీర్ మొదటి నుంచి ఆవేశపూరితంగా వ్యవహరించాడు. 19వ ఓవర్ చివరి బంతికి క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మన్ సిక్సర్ కొట్టడంతో కేకేఆర్ విజయం ఖరారయినప్పుడు కెప్టెన్ గంభీర్ కోపంగా లేచి, చేతిలో ఉన్న టవల్ ను బౌండరీ మీదకు విసిరాడు. అంతటితో ఆడకుండా ఆటగాళ్లు కూర్చోవడానికి ఏర్పాటుచేసిన కుర్చీలను కాలితో బలంగా తన్నాడు. ఈ దృశ్యాలు ప్రత్యక్షంగా ప్రసారం కావడంతో గంభీర్ ప్రవర్తన చర్చనీయాంశమైంది. అయితే అన్ని అంశాలను కూలంకశంగా పరిశీలించిన అనంతరం గంభీర్ కు ఫైన్ వేస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ బుధవారం ప్రకటించారు.

ఇక కోహ్లీ విషయానికి వస్తే గతంలోనూ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన ఈ ఆర్ సీబీ కెప్టెన్.. కోల్ కతాతో మ్యాచ్ లోనూ ఓవర్లు స్లోగా వేయించాడు. దీంతో మొత్తం జట్టు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా ఒక్కో ఆటగాడికి రూ.6లక్షల జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ పేర్కొన్నారు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఇంత భారీ పరిమాణంలో ఫైన్ లు ఉండవు. కానీ ఐపీఎల్ నియమావళి ప్రకారం జరిమానాలు భారీగా ఉంటాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles