No Real Talent in Pakistan, I am Not Quitting: Shahid Afridi

Shahid afridi urges pcb to focus on grassroots level

Shahid Afridi, PCB, pakistan, Shahid Afridi,Pakistan Cricket Board,Cricket, latest Cricket newsCoach, Dean Jones, Grant Flower, Head coach, Jamie Siddons, Mickey Arthur, Pakistan, Pakistan Cricket Board, PCB, Peter Moores, Ramiz Raja, Tom Moody, Wasim Akram

Shahid Afridi, former Twenty20 skipper, has said that Pakistan Cricket Board must go back to the basics and work at the grassroots level for the national team to succeed

జట్టు మూలాలను పరిశీలించి మార్పులు చేయాలి

Posted: 05/04/2016 01:48 PM IST
Shahid afridi urges pcb to focus on grassroots level

అసియా కప్ ఆ తరువాత టీ 20 ప్రపంచకప్లో పూర్తిగా విఫలమై పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన షాహిద్ ఆఫ్రిది.. మళ్లీ సత్తాచాటుకుని జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ జట్టులో తిరిగి స్థానం సంపాదించడమే తన ముందున్న లక్ష్యమని ఆఫ్రిది తెలిపాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తానన్నాడు. వరల్డ్ టీ 20 అనంతరం పాకిస్తాన్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆఫ్రిది ఆ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

అయితే త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో కూడా ఆఫ్రిదికి స్థానం కోల్పోయాడు. సోమవారం ప్రకటించిన పాక్ జట్టులో ఆఫ్రిదికి చోటు దక్కలేదు. అయితే కింది స్థాయి క్రికెట్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దృష్టి నిలపాల్సిన అవసరం ఉందంటూ ఆఫ్రిది సూచించాడు. పాకిస్తాన్ జట్టును మళ్లీ విజయతారాలకు చేర్చాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలను, మార్పులు జరగాల్సిన అవసరం వుందని అఫ్రీది అభిప్రాయపడ్డాడు. కిందిస్థాయి నుంచి జట్టును పటిష్టపరిస్తేనే పాకిస్తాన్ క్రికెట్  మెరుగుపడుతుందని అశాభావం వ్యక్తం చేశాడు.
 
దేశవాళీ క్రికెట్పై పీసీబీ మరింత దృష్టి సారించాల్సి వుందని సూచించిన ఆయన.. ప్రత్యేకంగా కింది స్థాయి నుంచి పాక్ క్రికెట్ ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. బాల్య వ్యవస్థ నుంచే మెరుగ్గా అడుతున్న పాఠశాల విద్యార్థులను మెరుగైన శిక్షణను అందిస్తూ వారిని మెరికల్లా తయారు చేయాల్సిన అవసరం వుందన్నాడు. ప్రధానంగా స్కూల్ క్రికెట్ పై ఫోకస్ చేయాలని పేర్కోన్నాడు. తాను చూసినంత వరకూ పాకిస్తాన్ క్రికెట్ వెనుక బలం కూడా పెద్దగా లేదు. దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్ట్యా సాధ్యమైనంత వరకూ ఎక్కువ దృష్టి స్కూల్ క్రికెట్ పై నిలపాలి'అని ఆఫ్రిది విజ్ఞప్తి చేశాడు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afridi  PCB  pakistan  pakistan cricket coach  pcb  

Other Articles