IPL 2016: Tom Moody has secret mantra to round-up Kohli-De Villiers show

Dhawan s form central to success as sunrisers face royal challengers

ipl 2016, ipl, ipl schedule, ipl news, ipl scores, srh vs rcb, ipl 2016, cricket, royal challengets bangalore, hyderabad sunrisers, IPL, chris gayle, kohli, watson, warner sports news, sports, cricket news, cricket

Standing 5th in table, Sunrisers are having a topsy-turvy tournament this season, losing and winning three matches apiece

కసీ తీర్చుకుంటారా..? గేల్, కోహ్లీ, వాట్సన్ లను కట్టడి చేస్తారు..?

Posted: 04/30/2016 04:59 PM IST
Dhawan s form central to success as sunrisers face royal challengers

ఒక జట్టులో చూస్తే విధ్వంసకర బ్యాట్స్‌మెన్... కలిసికట్టుగా చెలరేగితే ఆకాశమే హద్దు... మరో జట్టులో అత్యుత్తమ బౌలర్లు... ప్రత్యర్థిని కట్టడి చేయడంలో నిలకడైన రికార్డు... ఇప్పు డు ఈ రెండు జట్ల మధ్య సీజన్‌లో రెండో సమరానికి రంగం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 12న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 45 పరుగుల తేడాతో ఓడింది. దంతో ప్రతీకారం తీర్చుకుంటామని సన్ రైజర్స్ కసిగా చెబుతోంది.

ఇవాళ రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్లో విజయం సాధించడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ స్పష్టం చేశాడు. రాయల్స్ చాలెంజర్స్తో  అంతకుముందు జరిగిన  తొలి మ్యాచ్లో తమ ఓటమికి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్సే కారణమన్నాడు. ఆ ఇద్దర ఆటగాళ్ల విధ్వంసకర ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ పరాజయం చవిచూసిందన్నాడు.  అయితే ఈసారి వారి ఆటలు సాగనివ్వమని మూడీ తెలిపాడు.

కోహ్లి, ఏబీలను నిలువరిస్తాం. అందుకు మా దగ్గర చాలా ప్రణాళికలున్నాయి. వాటిని కచ్చితంగా అమలు చేసి ఆ ఇద్దర్ని నియంత్రిస్తాం.  గత బెంగళూరు పిచ్ కు, ఇక్కడి పిచ్ కు చాలా తేడా ఉంది. బ్యాటింగ్ కు అనుకూలించే బెంగళూరు పిచ్ పై వరల్డ్ క్లాస్ ఆటగాళ్లను నిలువరించలేకపోయాం. హైదరాబాద్ పిచ్ కు అందుకు భిన్నంగా ఉంటుంది.  గ్రౌండ్ ఆకారంలో కూడా రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అది మా కలిసొచ్చే అవకాశం ఉంది' అని మూడీ పేర్కొన్నాడు. సన్ రైజర్స్ తో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి(75), డివిలియర్స్(82) విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ 45 పరుగుల తేడాతో ఓటమి చెందింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  cricket  royal challengets bangalore  hyderabad sunrisers  IPL  chris gayle  kohli  watson  warner  

Other Articles