High-flying Sunrisers Hyderabad take on struggling Kings XI Punjab

Sunrisers hyderabad look stay on hatrick victory

Indian Premier League 2016, IPL, IPL 2016, IPL 9, Sunrisers Hyderabad,Kings XI Punjab,Indian Premier League 2016,IPL 2016,sunrisers hyderabad vs kings xi punjab,Playing XI,Team news,srh vs kings xi punjab,David Warner, KXIP

Sunrisers Hyderabad have climbed to fifth after two consecutive victories while Kings XI Punjab are placed at the bottom of the table with two points from four games.

హ్యాట్రిక్ పై గురిపెట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్

Posted: 04/23/2016 04:00 PM IST
Sunrisers hyderabad look stay on hatrick victory

వరుసగా రెండు మ్యాచులలో ఓడి, ఆ తరువాత వరుసగా రెండు విజయాలను నమోదు చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ పై దృష్టి సారించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు అడిన ఈ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమితో టోర్నీని మొదలుపెట్టి.. ఆ తరువాత వరుసగా రెండు విజయాలు సాధించి.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది, ఇవాళ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో  రాత్రి గం.8.00లకు కింగ్స్ పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.

మూడు వరుస విజయాలను నమోదు చేసుకున్న గుజరాత్ లయన్స్‌ను గురువారం జరిగిన మ్యాచ్‌లో ఖంగుతినిపంచిన సన్‌రైజర్స్ 10 వికెట్లతో అద్భుత విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసం పెంచింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ టీమ్ రాణిస్తోంది. ముఖ్యంగా వార్నర్ నాలుగు మ్యాచ్‌లలో మూడు అర్ధ సెంచరీలతో అద్భుతంగా ఆడుతుండగా, గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ధావన్ కూడా దూసుకొచ్చాడు. ఇదే ఓపెనింగ్ భాగస్వామ్యం మరోసారి చెలరేగితే ఆ తర్వాత మోర్గాన్, హెన్రిక్స్, దీపక్ హుడాల రాణింపుతో భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది.

ఇక బౌలింగ్‌లోనైతే ముస్తఫిజుర్ సూపర్ కటర్‌లకుతోడు  భువనేశ్వర్ కూడా తన స్వింగ్‌తో సత్తా చాటుతున్నాడు. శరణ్, బిపుల్ గొప్పగా రాణించకపోయినా, వరుస విజయాలు సాధించడంతో తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. యువరాజ్ సింగ్ నగరానికి చేరుకున్నా, అతను పూర్తి ఫిట్‌గా లేడు కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగడం లేదు.  మరోవైపు ప్రత్యర్థి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్‌లో అందరికంటే బలహీన జట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో మరో విజయం సాధిస్తే సీజన్‌లో దూసుకుపోవచ్చు.
 
పుణేతో మ్యాచ్‌లో సంచలన విజయం సాధించి ఒక్కసారిగా సీన్‌లోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆ తర్వాత కోల్‌కతాపై పేలవ ప్రదర్శన కనబర్చింది. ఓపెనర్లు విజయ్, వోహ్రా మాత్రమే చెప్పుకోదగినట్లుగా రాణిస్తున్నారు. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్, మిల్లర్ కలిపి నాలుగు మ్యాచ్‌లలో 75 పరుగులు మాత్రమే చేయగలగడం వారి వైఫల్యాన్ని సూచిస్తోంది.  బౌలింగ్‌లో కూడా పెద్దగా రాణించలేకపోతోంది. మోహిత్ , సందీప్ ఫర్వాలేదనిపించినా నిలకడ లేదు. ఈ మ్యాచ్‌లో కైల్ అబాట్ స్థానంలో మిషెల్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే పంజాబ్ గత ఏడాదిలాగే లీగ్‌లో పూర్తిగా వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunrisers Hyderabad  Kings Punjab  IPL  IPL-2016  

Other Articles