I am not for awarding man of the match in a team sport: Gautam Gambhir

Gautam gambhir says he is not for awarding man of the match in a team sport

gautam gambhir, indian premier league, man of the match, ipl 2016, ipl 9, kolkata knight riders, robin uthappa, shakib al hasan, sunil narine, sunrisers hyderabad

Gautam Gambhir says he is not for awarding man of the match in a team sport

మ్యాన్ అప్ ది మ్యాచ్ అవార్డుకు నేను వ్యతిరేకం

Posted: 04/23/2016 03:52 PM IST
Gautam gambhir says he is not for awarding man of the match in a team sport

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల ప్ర‌దానంపై టీమిండియా క్రికెటర్ ఆస‌క్తిక‌ర అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్ క్రికెట్‌లో మ్యాచ్ లలో మ్యాన్ అప్ ది మ్యాచ్ అవార్డును ప్రదానం చేయడాన్ని  తీవ్రంగా వ్యతిరేకించారు. క్రికెట్ జ‌ట్టులోని 11 మంది స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో మ్యాచ్ గెలిస్తే.. మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌ర్చిన జ‌ట్టులోకి ఒక్క‌రికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ప్ర‌దానం చేయ‌డ‌మేంట‌ని ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించాడు. టీమ్‌ని గెలిపించిన ఘ‌న‌త కేవ‌లం ఒక్కరికే ద‌క్కేలా చేయ‌డం స‌రికాద‌న్నాడు.

జట్టు సమిష్టి గెలుపును అస్వాధించనీయకుండా కేవలం ఒక్కరికే ఈ అవార్డును బహుకరించడం భవిష్యత్తులోనూ అనర్థాలకు దారితీస్తుందన్నారు. అస‌లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ప్ర‌దానం చేయ‌కూడ‌ద‌ని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ఇటీవ‌ల జ‌రిగిన మ్యాచ్‌ని గురించి ప్ర‌స్తావిస్తూ ఆ మ్యాచ్‌లో త‌న‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ల‌భించింద‌ని, కానీ త‌మ‌ బౌలర్లు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బ్యాట్స్‌మెన్స్‌పై విజృంభించ‌క‌పోతే త‌మ‌ జ‌ట్టు గెలుపునందుకోక‌పోయేద‌ని పేర్కొన్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ప్ర‌దానం చేయ‌క‌పోతేనే బాగుంటుంద‌ని అన్నాడు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Gambhir  man of the match  IPL-2016  Kolkata Knight Riders  

Other Articles