IPL 2016: Long way to go, but Mumbai Indians ride Rohit's 62 to swat aside RCB

Mumbai indians canter to six wicket victory over rcb

Indian Premier League 2016, IPL, IPL 2016, IPL 9, Rohit sharma, royal challengers bangalore, mumbai indians, ambati rayudu, IPL-2016, IPL9 Writers Pavilion, Jos Buttler, Kieron Pollard, Krunal Pandya, MI, RCB,

Mumbai Indians (MI) fans have enjoyed win over the Royal Challengers Bangalore (RCB), which must have come as a cool gust of wind on their worn faces.

బెంగళూరు ఛాలెంజర్స్ పై గెలిచిన ముంబయి ‘చేజర్స్’

Posted: 04/21/2016 06:34 PM IST
Mumbai indians canter to six wicket victory over rcb

ఐపీఎల్‌లో మళ్లీ చేజర్సే గెలుపోందారు. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ తో వాంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్  ముంబై ఇండియన్స్‌ అదరగొట్టింది. సొంత గ్రౌండ్ కావడంతో అడెడ్ అడ్వాంటేజ్ గా తీసుకున్న ముంబై ఇండియన్స్ తమ అత్యుత్తమ ఆటతీరుతో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించింది. రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు వీరవిహారం చేయడంతో ముంబై ఇండియన్స్.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును అలవోకగా మట్టికరిపించింది.

దీంతో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజీన్ 9లో జరిగిన 14 మ్యాచులలో 13 సార్లు చేజర్సే గెలుపొందారు. ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మ (62; 44 బంతుల్లో 4×4, 3×6) చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలచి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మరో అలోచన లేకుండా ఫీల్డింగ్ ను ఎంచుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో హెడ్‌ (37; 24 బంతుల్లో 2×4, 2×6) ముంబై బౌలర్లపై చెలరేగడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. కోహ్లి (33), డివిలియర్స్‌ (29), సర్ఫరాజ్‌ ఖాన్‌ (28) రాణించారు. కృనాల్‌ పాండ్య (2/27) బెంగళూరును కట్టడి చేశాడు.

తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబై రెండు ఓవర్లలో 8 పరుగులే చేసి, ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ (5) వికెట్‌ను చేజార్చుకున్నా ఛేదనను ముంబయి ధాటిగా ఆరంభించింది. రోహిత్‌ శర్మ, రాయుడు చెలరేగి బౌండరీలు బాదడంతో ముంబయి 6 ఓవర్లకు 51/1తో నిలిచింది. ఈ తర్వాత ఓవర్లో ఇక్బాల్‌ అబ్దుల్లాకు రాయుడు దొరికిపోయాడు. అప్పటికి స్కోరు 82. రోహిత్‌తో రెండో వికెట్‌కు రాయుడు 76 పరుగులు జోడించాడు. ఆ తర్వాత రోహిత్‌ ఔట్ అయ్యాడు.

ఆ ధశలో ముంబై గెలుపుకు 62 పరుగులు అవసరముండగా, రెచ్చిపోయి ఆడిన బట్లర్‌ వాట్సన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టడంతో పాటు ఇక్బాల్‌ అబ్దుల్లా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. ఇక గెలుపుకు 24 బంతులకు 28 పరుగులు చేయాల్సి వుండగా చెలరేగి ఆడిన పొలార్డ్‌.. హార్దిక్‌ (2 నాటౌట్‌) అండతో అలవోకగా లక్ష్యాన్ని పూర్తి చేశాడు. రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులను స్టాండ్స్‌లో పంపిన పొలార్డ్‌.. వాట్సన్‌ వేసిన 18వ ఓవర్లో సిక్స్‌, రెండు ఫోర్లతో పని ముగించాడు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit sharma  royal challengers bangalore  mumbai indians  ambati rayudu  IPL-2016  

Other Articles