amit mishra unlucky not to get five wickets says david miller

Amit mishra spins delhi daredevils to first win of the season

delhi daredevils, dd, kings xi punjab, kxip, dd kxip, dd kxip match, dd kxip result, dd ipl results, dd ipl 9, kxip ipl 9, kxip ipl result, dd kxip score, amit mishra, quinton de kock, ipl schedule, ipl score, ipl matches, ipl news, ipl

Playing his 100th IPL match, Amit Mishra picked up four wickets and became the second highest wicket taker in IPL history.

ఐదు వికెట్ల తీసే అదృష్టం లేకపోయింది..

Posted: 04/16/2016 06:58 PM IST
Amit mishra spins delhi daredevils to first win of the season

ప్రత్యర్థి బౌలర్‌ అమిత్‌ మిశ్రాపై పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ కెప్టెన్‌ డేవిడ్ మిల్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో ఈ లెగ్‌ స్పిన్నర్‌కు అదృష్టం కలిసిరాలేదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి అమిత్‌ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సొంతం చేసుకొని ఉండేవాడని, కానీ ఆ అవకాశం అతనికి రాలేదని చెప్పాడు. మూడు ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిల్లర్‌తోపాటు ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ అయిన షాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ను తన స్పిన్‌ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు అమిత్‌.  

అతని పర్ఫార్మెన్స్‌పై మిల్లర్‌ మాట్లాడుతూ 'మిశ్రాకు అదృష్టం కలిసిరాలేదు. అతను ఐదు వికెట్లు లభించలేదు. అతను గ్రేట్ బౌలర్‌. నన్ను, మాక్స్‌వెల్‌ ను, మార్ష్‌ను ఔట్‌ చేసి.. గేమ్‌ ఛేంజర్‌గా నిలిచాడు' అని చెప్పాడు. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోని బౌలింగ్‌ పిచ్‌పై మిల్లర్‌ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 'నిజానికి లో స్కోరింగ్‌తో గేమ్‌ గతి మారిపోయింది. మేం వరుసగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ గమనాన్ని మార్చింది. పిచ్‌ బాగానే ఉంది' అని చెప్పాడు.

ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ బౌలర్‌ అమిత్ మాట్లాడుతూ 'మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా చూశాను. పంజాబ్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు ప్రయత్నిస్తే.. వారిని ఎలా పెవిలియన్‌కు పంపాలనే దానిపై కెప్టెన్ జాక్‌ (జహీర్ ఖాన్‌)తోనూ చర్చించాను. ఆ వ్యూహాలు ఫలించడం ఆనందంగా ఉంది' అని చెప్పాడు. ఈ ప్రదర్శన ద్వారా వందో మ్యాచ్‌లో పర్పుల్‌ క్యాప్‌ పొందడం ఆనందంగా ఉందని తెలిపాడు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi daredevils  David Miller  Amit Mishra  IPL  

Other Articles