Indian players want coach Ravi Shastri to continue in his role

Ravi shastri remains team indias favourite for coach job

india cricket team, india cricket, ravi shastri, ravi shastri india, ipl, ipl 2016, virat kohli, ms dhoni, murali vijay, bcci, bcci india, india bcci, cricket news, cricket

the senior cricket players are pleased with the work Shastri has done as Team Director, and want him to be reappointed.

టీమిండియా కోచ్ పగ్గాలు మళ్లీ రవిశాస్త్రికే.. సీనియర్ల సిఫార్సు..

Posted: 04/12/2016 08:28 PM IST
Ravi shastri remains team indias favourite for coach job

టీమిండియా క్రికెట్ కోచ్ గా మరోమారు రవిశాస్త్రికే పగ్గాలు అందే అవకాశాలు వున్నాయి, వరల్డ్ టీ 20 టోర్నీ వరకు టీమిండియా డైరెక్టర్ గా కొనసాగిన రవిశాస్త్రికే కోచ్గా బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. టీమిండియా జట్టు విజయాలలో ఆయన శ్రమను సీనియర్ క్రికెటర్ల నుంచి కితాబు లభించిన నేపథ్యంలో కోచ్ పదవినికి కూడా అతనికే ఇవ్వాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన ఉన్నత స్థాయి క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) కూడా రవిశాస్త్రి వైపే మొగ్గు చూపినట్లు బోర్డు వర్గాలు సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

దీనిలో భాగంగా ఈ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఆటగాళ్లతో సమావేశమైన అనంతరం రవిశాస్త్రి కోచ్ పదవిపై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా జట్టులో అధికశాతం మంది ఆటగాళ్లు రవిశాస్త్రితో కలిసి పనిచేయడాకి మద్దతు తెలిపారు.  మళ్లీ రవిశాస్త్రితో కలిసి పని చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని సీనియర్ ఆటగాళ్లు సైతం పేర్కొనడంతో అతని కోచ్ పదవి దాదాపు ఖాయమైనట్లే కనబడుతోంది. దీనిపై బీసీసీఐ అధికార ప్రకటన  మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

భారత క్రికెట్ జట్టు తన టెస్టు సిరీస్ లో భాగంగా వచ్చే జూలైలో  వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కోచ్ పదవిపై తొందరగా నిర్ణయం తీసుకంటేనే మంచిదని బీసీసీఐ యోచిస్తోంది. అయితే కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్ కూడా పోటీపడుతున్నారు, కాగా ఈ  అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించేందుకు కావాల్సినంత  సమయం కావాలని ద్రవిడ్ సందిగ్దత వ్యక్తం చేయడంతో బోర్డు పునరాలోచనలో పడింది. దీనిలో భాగంగానే అంతకుముందు జట్టు సభ్యులతో కలిసి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రిని చీఫ్ కోచ్గా నియమిస్తే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Shastri  india  coach  virat kohli  ms dhoni  murali vijay  bcci  team india  

Other Articles