ms dhoni removed his right glove before last ball in advance

Dhoni calculated experience makes india win against bangladesh

icc world t20, icc world t20 scores, world t20 news, world t20 scores, india thrilling win, MS Dhoni, Cricket, India v/s Bangladesh, India vs Bangladesh Scorecard, Zaheer Khan, VVS Laxman, Sunil Gavaskar, Virender Sehwag, Sanjay Manjrekar

mahindra singh dhoni calculated experience makes india win against bangladesh, he removes his right glove before last ball in advance

ధోని అనుభవమే టీమిండియా విజయానికి దోహదం

Posted: 03/24/2016 03:23 PM IST
Dhoni calculated experience makes india win against bangladesh

టీ20 ప్రపంచకప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరికి రనౌట్ తో టీమిండియా విజయం సాధించింది. రనౌట్ చేయాలని 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని ముందుగానే సిద్ధమైనట్టు కనబడుతోంది. హార్ధిక్ పాండ్యా చివరి బంతిని వేసే ముందు ధోనిని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మహేంద్ర సింగ్ ధోని అపార అనుభవం, చతురత బంగ్లాను ఓడించి టీమిండియాకు విజయాన్ని వరించేట్లు చేసింది. ఒక్క పరుగు తీస్తే.. స్కోరు సమానమై చెరి రెండు జట్లకు సమానంగా పాయింట్ల పంచే అవకాశముంది.

కానీ ఆ పరిస్థితి తప్పించి టీమిండియాకు విజయాన్ని అందించిపెట్టడంతో ధోని చతురత దోహదరం చేసింది. ఇలా చేయాలని ముందుగానే వారు కూడబలుకుని చివరి బంతి వేయడానికే ముందే ధోని తన కుడిచేతి గ్లౌజ్ తీసేశాడు. సాధారణంగా వికెట్ కీపర్లు చేతులకు రెండేసి గ్లౌజులు వేసుకుంటారు. చేతికి అంటిపెట్టుకుని గ్లౌజులతో పాటు వదులుగా ఉండే గ్లౌజులు ధరిస్తారు. బంతిని ఒడిసిపట్టిన తర్వాత దాన్ని విసిరే క్రమంలో చేతికున్న పెద్ద గ్లౌజును తీసేస్తుంటారు. వదులుగా ఉండే పెద్ద గ్లౌజులు ధరించి వికెట్లను కొట్టడం కష్టం. కాబట్టి ధోని ముందుగానే రనౌట్ కు ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతోంది.

ఇక రెండో ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ వచ్చేలోపే 15 గజాల దూరం పరుగెత్తి ధోని రనౌట్  చేయడం విశేషం. దూరం నుంచి బంతి విసిరితే అది వికెట్లకు తగలకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదముందని గ్రహించిన టీమిండియా కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి పరుగులు తీయడంలో ధోని ఎక్స్ పర్ట్  అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విశ్వాసంతోనే ధోని వికెట్ల దగ్గరకు పరుగెత్తికొచ్చి రనౌట్ చేయగలిగాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  bangladesh  team india  T20 world cup  India vs bangladesh  

Other Articles