వరల్డ్ ట్వంటీ 20 అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోబోతున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వాట్సన్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ తరువాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్ తరువాత టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు చెప్పిన వాట్సన్.. గత సెప్టెంబర్ నుంచి వన్డేలకు కూడా దూరంగా ఉన్నాడు.
తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు వాట్సన్ పేర్కొన్నాడు. తాను ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఒకింత గర్వంగా ఉందన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి తరచు గాయాల బారిన పడటం కూడా ఒక కారణమని వాట్సన్ పేర్కొన్నాడు. ఇటు వన్డేల్లో, టెస్టుల్లో, ట్వంటీ 20 ల్లో ఆస్ట్రేలియాకు అద్భుత విజయాలందించిన వాట్సన్.. 59 టెస్టు మ్యాచ్ లు, 190 వన్డేలు ఆడగా, 56 ట్వంటీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు.
2002లో సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన వాట్సన్.. 2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతని టెస్టు కెరీయర్ లో 35 .0 పైగా సగటుతో నాలుగు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో షేన్ వాట్సన్ అత్యధిక స్కోరు 176. కాగా, 75 వికెట్లు తీశాడు. ఇక వన్డేల విషయానికొస్తే 9 సెంచరీలు ,33 హాఫ్ సెంచరీల సాయంతో 5,757 పరుగులు చేయగా, 168 వికెట్లు తీశాడు. వన్డేల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 185 నాటౌట్. ఇక ట్వంటీ 20 ల్లో ఒక సెంచరీతో పాటు, 10 హాఫ్ సెంచరీలు సాధించగా, 46 వికెట్లు తీశాడు. ట్వంటీ 20ల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 124 నాటౌట్.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more