CAB hopeful of generating Rs 3 crore from India-Pak WC clash

Afridi led pakistan receive warm welcome in kolkata

India, Pakistan, World T20 match, Dharamsala, IPL matches, Indian Premier League, IPL, Dharamsala, Cricket Association of Bengal, CAB, India-Pakistan match, ICC, India-Pak WC clash,Kolkata, shahid afridi, HPCA, Anurag Thakur, cricket news,

CAB has decided against raising ticket prices despite suffering a Rs 3.7 crore loss during 2014-15

కోల్ కతాలో అఫ్రదీ సేన సాదరస్వాగతం.. అప్పల నుంచి భయటపడ్డ క్యాబ్

Posted: 03/13/2016 07:32 PM IST
Afridi led pakistan receive warm welcome in kolkata

టీ20 వరల్డ్ కప్ పోటీలకు భారత్, పాకిస్థాన్ జట్లు సన్నధ్ధం అవుతున్నాయి. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న షాహిద్ అఫ్రిది నేతృత్వంలో 27 మందితో కూడిన బృందం అబుదాబి నుంచి శనివారం రాత్రి కోల్ కతాకు చేరుకోగా, అఫ్రీది సేనకు కోల్ కతా వాసుల నుంచి సాదర స్వాగతం లభించింది. భారీ భద్రత నడుమ హోటల్ కు చేరుకున్న పాక్ జట్టు.. ఇవాళ ఉదయమే ఈడెన్ గార్డెన్ కు చేరుకుని నెట్ ప్రాక్టీస్ లో మునిగిపోయింది. శ్రీలంకతో సోమవారం జరగనున్న వామప్ మ్యాచ్ లో సత్తాచాటలని భావిస్తోన్న పాక్ కు 19న భారత్ తో పోరు పెనుసవాలుగా మారింది. ఆసియా కప్ లో పరాజయం తర్వాత స్వదేశంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఈసారి అవకాశం కోల్పోకూడదని అనుకుంటోంది. నెట్ ప్రాక్టీస్ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్ చుట్టుపక్కల కనీవినీ ఎరుగనిరీతిలో భద్రతా బలగాలు మోహరించాయి. భారత్ తో మ్యాచ్ జరిగే రోజు వేల మంది సాయుధులు పహారాకాయనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో పాక్ జట్టు కెప్టెన్ అఫ్రీదీ మాట్లాడుతూ.. భారత్ లో స్వదేశం కన్నా అధికంగా అదరాభిమానాలు లభిస్తాయని, వాటిని ఎంజాయ్ చేస్తానన్నారు. ఇటీవల కాలంలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని, టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మార్చి 19న భారత్ తో జరగనున్న మ్యాచ్ తమకు కీలకమని చెప్పుకొచ్చాడు. ఆట, రాజకీయం అనేది రెండు భిన్నమైన అంశాలని చెప్పాడు. తొలి మ్యాచ్ ఎప్పిటికీ చాలా ముఖ్యమైనదని, అందుకే బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ నుంచే తమ పోరు ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్ భారత్ తో ఉందని, ఆ మ్యాచ్ కూడా తమకు చాలా టఫ్ అని అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్ల ప్రదర్శనపై పూర్తి నమ్మకం ఉందని పాక్ కెప్టెన్ అఫ్రిది అంటున్నాడు.

దాదాపు రూ. 3.7 కోట్ల నష్టాల్లో ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) పంట పండే సమయం వచ్చింది. అనూహ్య పరిస్థితుల్లో భారత్, పాక్ టీ-20 మ్యాచ్ వేదిక ధర్మశాల నుంచి కోల్ కతాకు మారడంతో, టికెట్ల అమ్మకాల మూలంగానే క్యాబ్ దాదాపు రూ. 3 కోట్లను వెనకేసుకోనుంది. మార్చి 19న జరిగే భారత్, పాక్ మ్యాచ్ ఈ టోర్నమెంటులోనే అత్యధిక వ్యాపార ప్రకటనల ఆదాయాన్ని ఐసీసీ ఖజానాకు చేరవేస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్ కి టికెట్ ధరలను రూ. 500, రూ. 1,000, రూ. 1,500లుగా నిర్ణయించామని, టికెట్ ధరలను పెంచాలన్న ఉద్దేశం లేదని క్యాబ్ స్పష్టం చేసింది. మొత్తం 67 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ ని తిలకించే అవకాశం ఉండగా, కేవలం టికెట్ అమ్మకాల ఆదాయం మాత్రమే క్యాబ్ కు మిగులుతుంది. దీన్ని ఈ సంవత్సరం తమకు అదనంగా వచ్చే ఆదాయంగా పరిగణించనున్నామని క్యాబ్ అధికారి ఒకరు తెలిపారు.    

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  shahid afridi  World T20 match  Eden gardens  kolkata  

Other Articles