There are expectations from Mohammed Shami: Rohit Sharma

We expect a lot from come back shami says rohit sharma

2016 T20 World Cup, cricket, India, mohammed shami, rohit sharma, t20 world cup 2016, West Indies

Mohammed Shami is working very hard to get his rhythm back and Indian team has lot of expectations from him in the World Twenty20

వరల్డ్ కప్ లో పేసర్ షమీపై భారీ అంచానాలు

Posted: 03/11/2016 06:24 PM IST
We expect a lot from come back shami says rohit sharma

వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న టీమిండియా పేసర్ మొహ్మద్ షమీపై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దాదాపు ఏడాది కాలంగా గాయాలతో సతమవుతున్న షమీ..గురువారం వెస్టిండీస్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో పాల్గొని ఆకట్టుకోవడం నిజంగానే భారత జట్టుకు శుభసూచకమన్నాడు. టీమిండియా జట్టులో మొహ్మద్ షమీ ఒక కీలక బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.  కచ్చితమైన ప్రణాళికలను అమలు చేయడంలో షమీ దిట్ట అని రోహిత్ కొనియాడాడు.

'మేము ఏదైతే ఆశిస్తామో దాన్ని షమీ నెరవేరుస్తూ ఉంటాడు.  అటు బౌన్సర్లు, యార్కర్ల దగ్గర్నుంచి, స్లో బంతులను కూడా సమర్ధవంతంగా సంధిస్తాడు. టీమిండియా తరపున షమీ చివరిసారిగా ఆడేసరికి అతను మా ప్రధానబౌలర్లలో ఒకడు. తొడ కండరాల గాయం నుంచి ఒక పేస్ బౌలర్ అంత తొందరగా కోలుకోవడం సులువు కాదు. అతని కష్టించే తత్వంతోనే వెస్టిండీస్ మ్యాచ్ లో షమీ ఆకట్టుకున్నాడు' అన్నాడు. వెస్టిండీస్ జరిగిన వార్మమ్ మ్యాచ్లో షమీ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. మోకాలి శస్త్రచికిత్సతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న షమీ  ఫిట్ నెస్ ను పరీక్షించే క్రమంలో అతన్ని విండీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడించారు. ఆ మ్యాచ్ లో షమీ ఫర్వాలేదనిపించడంతో అతని స్థానంపై భరోసా ఏర్పడింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohit sharma  Mohammed Shami  india  twenty 20 world cup  

Other Articles