I would have found 'extremely difficult' bowling against Virat Kohli: Wasim Akram

Wasim akram rates virat kohli as the best batsman in the world

Wasim Akram,Virat Kohli,ICC World T20,Mohammad Amir,India Wasim Akram,India vs Pakistan, world up t20, t20 world cup, india, world's best batsmen, best batsman virat

Akram has hailed the Indian batting star for his consistency in all three formats of the game.

ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ విరాటుడే

Posted: 03/10/2016 08:25 PM IST
Wasim akram rates virat kohli as the best batsman in the world

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ ఎవరో తెలుసా? ఇంకెవరూ టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్, భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీనే. అవును ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా.. ఏచోట విన్నా విరాట్ కోహ్లీ పేరు మార్మోగిపోతుంది. అయితే ఏకంగా ఆయన ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అంటూ బిరుదాంకితుడ్ని చేసి.. అకాశానికి ఎత్తిసింది మాత్రం దాయాధి దేశానికి చెందిన మాజీ కెప్టెన్. సస్పెన్స్ ఎందుకు ఆయనెవరో చెప్పండీ అంటున్నారా.?

ఆయనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఒకనాటి సూపర్ ఫాస్ట్ బౌలర్, క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్. ఆయన దృష్టిలో టెస్టు అయినా, వన్డే అయినా, చివరకు టీ20 అయినా... మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న విరాట్ కోహ్లీపై వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మన్ ఎవరని తననడిగితే... విరాట్ కోహ్లీనే అని టక్కున చెప్పేస్తానని అక్రమ్ పేర్కొన్నాడు. ‘స్పోర్ట్స్ టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ప్రతిభాపాటవాలను ఆకాశానికెత్తేసిన అక్రమ్... కోహ్లీకి బౌలింగ్ వేయాలంటే చాలా కష్టమైన పనేనంటూ వ్యాఖ్యానించాడు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Wasim Akram  icc T20 world cup  world's best batsmen  

Other Articles