Google doodle marks beginning of ICC T20 Cricket World Cup 2016

Google doodle runs high on t20 cricket world cup fever

ICC T20, google doodle, T20 Cricket World Cup 2016, Google, Cricket stadium, spectators, mega cricketing event

Google observes the start of T20 World Cup with a doodle. A cricket stadium is sketched out to celebrate the beginning.

ఐసీసీ వరల్డ్ కప్ కు డూడుల్ తో గూగుల్ స్వాగతం..

Posted: 03/07/2016 02:38 PM IST
Google doodle runs high on t20 cricket world cup fever

ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్‌, అంతర్జాల దిగ్గజం గూగుల్‌కు కూడా క్రికెట్ ఫీవర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 క్రికెట్‌ ప్రపంచకప్‌ కు ఒక రోజు ముందుగానే స్వాగతం పలుకింది. ఈ మేరకు గూగుల్‌ తన హోంపేజీలో ప్రత్యేక డూడుల్‌ ఏర్పాటుచేసింది. ఇప్పటికే భారత్ సహా అసియా దేశాల అభిమానులకు ఆసియాకప్ టీ-20 టోర్నమెంటు కనువిందు చేసింది.

కాగా ఈ టోర్నమెంటు ముగిసిన ఒక్క రోజు తరువాత ప్రపంచ కప్ టీ20 టోర్నీ ఆరంభం కావడం.. ఏప్రిల్‌ 3 వరకు కొనసాగనుండటంతో అభిమానుల వేసవి ఆనందానికి అవధులు లేకుండా వున్నాయి. భారత్ వేదికగా జరగుతున్న ఈ మెగా ఈవెంట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యాంలో టి-20 ప్రపంచ కప్నకు స్వాగతం పలుకుతూ ఆరంభానికి ఒక్క రోజు ముందు గూగుల్ హోం పేజీలో కొత్త డూడుల్ను పోస్ట్ చేసింది.

స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్న దృశ్యం గూగుల్ డూడుల్లో కనిపిస్తుంది. భారత్‌లోని ఏడు వేదికలలో జరగనున్న ఈ మ్యాచ్‌లలో 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లు రేపు నాగ్‌పూర్‌లో జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు జింబాబ్వే-హాంగ్‌కాంగ్‌, సాయంత్రం 7.30 గంటలకు స్కాట్లాండ్‌-ఆఫ్ఘనిస్థాన్‌ తలపడునున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles