Robin Uthappa ties the knot with Sheethal Goutham

Robin uthappa weds tennis player sheethal goutham

robin uthappa, uthappa wedding, robin uthappa marriage photos, uthappa marriage photos, uthappa wife, dhawal kulkarni, kulkarni marriage, dhawal kulkarni marriage, dhawal kulkarni photos, dhawal kulkarni marriage photos, dhawal kulkarni marriage pics, kulkarni bowling, uthappa batting, india team, sports news, cricket, sport, cricket news

India cricketer Robin Uthappa married former tennis player Sheethal Goutham in a private ceremony and subsequently hosted a reception here on Thursday night.

టెన్నిస్ క్రీడాకారిణి షీతల్ గౌతమ్ తో రాబిన్ ఉతప్ప పరిణయం

Posted: 03/04/2016 10:44 AM IST
Robin uthappa weds tennis player sheethal goutham

భారత క్రికెట్ లో పెళ్లి సందడి కొనసాగుతోంది. యువ క్రికెటర్లు ఇంటివాళ్లు అవుతున్నారు. ఇటీవల హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ వివాహాలు చేసుకోగా, డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్  విదేశీ నటితో డేటింగ్ చేయడం, పనిలోపనిగా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది పరిణయం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇదిలావుండగానే టీమిండియాలో కీలక బ్యాట్స్ మన్ గా కొనసాగిన రాబిన్ ఊతప్ప కూడా తాజాగా ఇంటివాడు అయ్యాడు. టెన్నిస్ క్రీడాకారిణిగా క్రీడా ప్రపంచంలో బాగానే ప్రాచుర్యం పొందిన షీతల్ గౌతమ్ ను ఊతప్ప క్రితంరోజు పరిణయం అడాడు.

దేశ రాజధాని ఢిల్లీలో వీరి వివాహం జరుగగా, ఈ వివాహ వేడుకకు ఊతప్ప సహచర క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో పాటు పలువురు దేశవాలీ క్రికెటర్లు కూడా హజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ నటి జుహి చావ్లాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, టీమిండియా జట్టులో స్వల్పకాలం పాటు కొనసాగి, ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న ధావల్ కులకర్ణి కూడా నిన్న పెళ్లి చేసుకున్నాడు. ఫ్యాషన్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న శ్రద్ధ కర్పూడేను అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా కులకర్ణికి శుభాకాంక్షలు తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robin Uthappa  cricketer  tennis player  marriage  Sheethal Goutham  

Other Articles