India vs UAE: India beat UAE by 9 wickets to remain unbeaten in asia cup

India vs uae asia cup t20 india beat uae by 9 wickets

India vs United Arab Emirates LIVE Score, Ind vs UAE Live, Asia Cup Live, Live Cricket Score, live cricket, Live cricket streaming, Mahendra Singh Dhoni, Amjad Javed, Yuvraj Singh, cricket news

A mere total of 81/9 by UAE was too less for India. They came in and finished it in just 10.1 overs to stay unbeaten in the league games of the Asia Cup T20

యూఏఈపై 9 వికెట్ల తేడాతో టీమిండియా విజయం..

Posted: 03/04/2016 10:05 AM IST
India vs uae asia cup t20 india beat uae by 9 wickets

ఆసియా కప్ టోర్నమెంటులో ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తున్న టీమిండియా మరోసారి తన సత్తా చాటింది.  బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో నిన్న రాత్రి యూఏఈతో జరగిన మ్యాచ్ టీమిండియా అద్బుత ప్రతిభను కనబర్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకున్న యూఏఈను  తొలుత బౌలింగ్తో బెదరగొట్టి.. అటు తరువాత బ్యాటింగ్లో అదరగొట్టింది. తద్వారా ఆసియాకప్లో తమ చివరి లీగ్ మ్యాచ్‌ ఆడిన ధోని సేన  తొమ్మిది వికెట్ల విజయాన్ని సాధించింది.

యూఏఈ విసిరిన 82 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(39; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తనదైన మార్కును చూపిస్తూ దూకుడుగా ఆడాడు.  కాగా, జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్(16 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు), యువరాజ్ సింగ్(25; 14 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్))లు మరో వికెట్ పడకుండా 39 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా 10.1 ఓవర్లోనే విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆది నుంచి బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడింది. పటిష్టమైన భారత బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కొలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(43) మినహా ఎవరూ రాణించలేదు. అన్వర్ తరువాత రోహన్ ముస్తఫా(11)ది అత్యధిక స్కోరు కావడం గమనార్హం.  దీంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో  తొమ్మిది వికెట్ల నష్టానికి 81 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్కు రెండు వికెట్లు లభించగా, బూమ్రా, పాండ్యా, హర్భజన్ సింగ్, నేగీ, యువరాజ్లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia cupn 2016  india  uae  league match  

Other Articles