Sania, Kohli lead pack of 56 Indians in Forbes' Asia list

Indian sportstars in forbes asia inaugural list

Sania Mirza, Virat Kohli, Saina Nehwal, Forbes, young leaders, game changers, forbes young leaders, forbes asia inaugural list, top 50 young leaders in 30s, tennis player, cricketer, martina hingis,

Sania Mirza, Virat Kohli and Saina Nehwal lead the pack of over 50 Indians in Forbes' inaugural list of top promising young leaders and game changers under the age of 30 in Asia.

ఫోర్బ్స్ అసియా తొలి జాబితాలో విరాట్, సానియా, సైనా

Posted: 02/25/2016 06:48 PM IST
Indian sportstars in forbes asia inaugural list

తమ తమ రంగాలలో గత కొన్నేళ్లుగా మున్ముందుకు దూసుకుపోతున్న భారత్ క్రీడాకారులు ఫోర్బ్స్ అసియా టాప్ 50 జాబితాలో నిలిచారు. క్రికెట్ లో దూకుడు స్వభావంతో వ్యవహరించి తన సత్తాను చాటడంతో పాటు జట్టు విజయానికి కృషి చేస్తున్న విరాట్ కోహ్లీతో పాటు టెన్నిస్ క్రీడలో మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచిన సానియా మిర్జా సహా బ్యాడ్మింటన్ లో దూసుకుపోతున్న సైనా నెహ్వాల్ పేర్లను ఫోర్బ్స్ 'ప్రామిసింగ్ యంగ్ లీడర్స్ అండ్ గేమ్ ఛేంజర్స్' జాబితాలో పొందుపర్చింది.

ఆసియాఖండంలో 30 సంవత్సరాలలోపు అత్యంత ప్రతిభగల క్రీడాకారులను 300 మందిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. అందులో 56 మంది భారతీయులకు స్థానాలు దక్కాయి. వారిలో కోహ్లీ, సానియా, సైనా ముందు వరసలో నిలవడం విశేషం. కోహ్లీ ఆధ్వర్యంలో ఇటీవల భారత జట్టు టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిందని, అంతేగాక, భారత్ లో ఆయన అత్యధికంగా ఏడాదికి 11.3 మిలియన్ డాలర్లు ఆర్జించారని ఫోర్బ్స్ పేర్కొంది. గత సంవత్సరంపైగా భారత టెన్నిస్ లో సానియా విజయవంతమైన క్రీడాకారిణిగా కొనసాగుతున్నారని, సైనా భారత బ్యాడ్మింటన్ క్వీన్ అని ఫోర్బ్స్ ప్రశంసించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Sania Mirza  Saina Nehwal  forbes asia  

Other Articles