Mahendra Singh Dhoni reveals his retirement plan

Ms dhoni deflects retirement rumours with humour

ms dhoni, ms dhoni india, india ms dhoni, dhoni india, india dhoni, dhoni retirement, dhoni retire, when is dhoni retiring, when will dhoni retire, india cricket team, india cricket, bcci, world t20, asia cup, ipl, ipl 9, rising pune supergiants, ipl pune, cricket news, cricket, sports

MS Dhoni was relaxed right through the interaction but revealed a steely desire to make an impact at home at the World T20.

తన రిటైర్మెంటుపై వ్యాఖ్యలు చేసిన మిస్టర్ కూల్

Posted: 02/20/2016 05:04 PM IST
Ms dhoni deflects retirement rumours with humour

లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మరోసారి రిటైర్మెంట్‌ గురించి స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పట్లో తప్పుకోబోనని, రిటైర్మెంట్‌ గురించి అంత తొందరేమీ లేదని ధోనీ స్పష్టం చేశాడు. 2014 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ అనంతరం ధోనీ అర్ధంతరంగా టెస్టులకు గుడ్‌బై చెప్పిన తరువాత నుంచి వన్డేలు, టీ-20 మ్యాచులకు ఈ 34 ఏళ్ల క్రికెటర్‌ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ తన సారథ్యంలో టీమిండియాకు అనేక విజయాలు అందించాడు. అతని నాయకత్వంలో 2007లో టీ -20 వరల్డ్ కప్, 2011లో వరల్డ్‌ కప్‌ భారత జట్టు సాధించింది. టెస్టుల్లోనూ అత్యుత్తమ ర్యాంకు సాధించింది.

తొమ్మిదేళ్ల కిందట దక్షిణాఫ్రికాలో అందుకున్న పొట్టి మ్యాచుల వరల్డ్ కప్ ను మళ్లీ స్వదేశంలోనూ తన చేతుల మీదుగా అందుకోవాలని ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ ఉవ్విళ్లూరుతున్నాడు. మళ్లీ టీ-20 వరల్డ్ కప్ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. లైఫ్‌ స్టైల్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ధోనీ.. మీడియాతో మాట్లాడుతూ.. 'ఆసియా కప్‌, టీ-20 వరల్డ్ కప్, ఆ వెంటనే ఐపీఎల్ ఇలా వరుసపెట్టి మ్యాచులు ఉన్నాయి. ఈ క్విక్ షెడ్యూల్ ముగిసిన వెంటనే టెస్టు సిరీస్‌లు, వన్డేలు కూడా ఉన్నాయి. అందుకు క్రికెటర్లు సన్నద్ధంగా ఉండాలి' అని ధోనీ చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  mahendra singh dhoni  retirement  

Other Articles