India choke Australia to T20 series win

India choke australia to t20 series win

India, Australia, Kohli, Rohith, T20, Virat Kohli, Dhoni

India beat Australia by 27 runs in the second T20 here on Friday to clinch series 2-0. Rohit Sharma (60) and Virat Kohli (59*) gave a solid start upfront, well complemented by the spinners in the end. (Australia: 157/8 - Finch 74, Marsh 23, Jadeja 2/32, Bumrah 2/37 India: 184/3 - Rohit Sharma 60, Virat Kohli 59*, Shikhar Dhawan 42, Tye 1/28, Maxwell 1/17)

టీమిండియా గ్రేట్ విక్టరీ.. టి20 సిరీస్ మనదే

Posted: 01/30/2016 08:32 AM IST
India choke australia to t20 series win

ఆసీస్‌తో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటి టీ20లో సాధించిన విక్టరీ టీమిండియా క్రికెటర్లలో బూస్ట్ నింపినట్లుంది. అందుకే బ్యాట్స్ మ్యాన్ లు, బౌలర్లు అదరగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించారు. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.రోహితం శర్మ47 బాల్స్ లో ఐదు ఫోర్లు, రెండు సిక్సులతో 60 రన్స్ చెయ్యగా రన్ ఔట్య అయ్యారు. తర్వాత వచ్చిన విరట్ కోహ్లీ కూడా తన బ్యాగింగ్ ప్రతాపాన్ని చూపించాడు. 33 బంతుల్లో రెండు సిక్సులు, మూడు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. ధోనీ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఏదేమైనా ఈ రెండు మ్యాచ్‌లు వీక్షించిన యువరాజ్ అభిమానులకు నిరాశే ఎదురైంది. తొలి మ్యాచ్‌లో అవకాశం రాకపోయినప్పటికీ రెండో మ్యాచ్‌లో అయినా యువరాజ్‌ బ్యాటింగ్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ మ్యాచ్‌ కూడా యువరాజ్ దాకా రాకుండానే బ్యాటింగ్ ముగిసిపోయింది.
 
ఆరోన్ ఫించ్ 74 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా బౌలర్లలో జడేజాకు 2, బూమ్‌రాకు 2, హార్థిక్ పాండ్యాకు 1, యువరాజ్ సింగ్‌కు 1, అశ్విన్‌కు 1 వికెట్ దక్కాయి. బ్యాట్స్‌మెన్ల ఘోర వైఫల్యంతో ఆసీస్ రెండో మ్యాచ్‌లో కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్‌ను అలవోకగా టీమిండియా కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Kohli  Rohith  T20  Virat Kohli  Dhoni  

Other Articles