Sania Mirza, Martina Hingis crowned 2016 Australian Open champions

Sania mirza martina hingis crowned 2016 australian open champions

Sania Mirza, martina Hingis, Australian Open, SaniaHingis pair

Women's world No 1 doubles pair Sania Mirza and Martina Hingis continued their otherworldly run and overcame the Czech duo Andrea Hlaváčková and Lucie Hradecká in staright sets to win the Australian Open at the Rod Laver Arena on Friday. The top seeds fought past the seventh seeds Andrea Hlavackova and Lucie Hradecka 7-6 (1) 6-3 in the women's doubles final that lasted just under two hours.

సానియా-హింగిస్ జోడి వరల్డ్ రికార్డ్

Posted: 01/30/2016 08:33 AM IST
Sania mirza martina hingis crowned 2016 australian open champions

సానియా-హింగిస్ జోడీ వరల్డ్ టెన్నిస్‌లో ఎదురులేని జోడి.  ఈ జంట గతేడాది నుంచి ఈజీగా  వరుస  విజయాలు సాధిస్తూ టెన్నిస్‌ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పటికే వరుసగా ఏడు టైటిళ్లు దక్కించుకున్న ఈ జోడి.. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌  టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాదిలో  సానియా-హింగిస్ ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లమ్‌. ఇవాళ జరిగినన ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో  సానియా- హింగిస్ జోడీ ఆండ్రియా- లూసీ  జంటపై  7-6, 6-3తో గెలుపొందింది. దీంతో వరుసగా ఎనిమిదో టైటిల్‌ను దక్కించుకుందీ జోడీ.

ఈ  విక్టరీతో  జోడీ ఖాతాలో వరుసగా 36 విజయాలు చేరాయి. ఇప్పటికే గత 26 ఏళ్లలో అత్యధిక వరుస విజయాలు సాధించి గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ..మరో సరికొత్త రికార్డుకు సిద్ధమవుతోంది. మరో ఐదు విజయాలు సాధిస్తే.. టెన్నిస్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడిగా సానియా-హింగిస్ వాల్డ్ రికార్డు సృష్టించనుంది. గతేడాది వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ సహా.. తొమ్మిది టైటిళ్లను దక్కించుకున్నారు. అదే ఉత్సాహంతో 2016లోకి అడుగుపెట్టిన  సానియా- హింగిస్ జోడి ఇప్పటికే రష్యా, బ్రిస్బేన్‌ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌తో హ్యాట్రిక్‌ విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  martina Hingis  Australian Open  SaniaHingis pair  

Other Articles