I take responsibility, should've carried on but got out says Dhoni

Blame me for canberra heartbreak says mahendra singh dhoni

ind vs aus, india vs australia, india australia, australia vs india, virat kohli, kohli, shikhar dhawan, dhawan, cricket,4th ODI, Aaron Finch, Australia, Australia vs India 2016, Canberra, Cricket, free cricket streaming, George Bailey, India, Josh Hazlewood, MS Dhoni, Ravichandran Ashwin, Rohit Sharma, Steven Smith, Virat Kohli

Mahendra Singh Dhoni scored zero after India looked good to chase Australia's 348 for 8 in the fourth ODI in Canberra.

ఓటమి తనదే బాధ్యతని ధోని కామెంట్

Posted: 01/20/2016 07:10 PM IST
Blame me for canberra heartbreak says mahendra singh dhoni

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ, ధావన్ బాధ్యతాయుతంగా ఆడి సెంచరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. శిఖర్ ధావన్ 126 పరుగులు విరాట్ కోహ్లీ 106 పరుగులు సాధించినా.. భారత జట్టు సారధి మహేంద్ర సింగ్ దోని పరుగేలేమీ చేయకుండానే వెనుదిరగడంతో జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నాలుగో వన్డేలో గెలుపు తథ్యం అన్న భారత క్రికెట్ అభిమానుల ఆశలు గల్లంతు కావడంపై కెప్టెన్ ధోని మ్యాచ్ అనంతరం స్పందించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఓటమికి తనదే బాధ్యతని ధోనీ అంగీకరించాడు. తాను పరుగులేమి చేయకుండా వచ్చిన వెంటనే పెవిలియన్ కు దారి పట్టడంతో ఆ ఒత్తడి జట్టుపై పడిందని దోని అంగీకరించాడు. తాను కోపంగా ఏమి లేను. కానీ, చాలా నిరాశ చెందుతున్నాను. సిరీస్లో గత మ్యాచ్ల కంటే కూడా మేం అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వన్డే ఇది. అయినా ఓటమి పాలయ్యాం. జట్టు ఓటమికి తనదే బాధ్యతని అంగీకరించాడు.

కోహ్లీ, ధావన్ బాగా ఆడినా..  తాను డకౌట్ అవడం వల్ల తన తర్వాత వచ్చిన ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిందన్నాడు. టాప్ ఆర్డర్  పెవిలియన్ చేరినప్పుడు తాను జట్టును ముందుకు నడిపించాలని. కానీ, అవుటయ్యాను. దీంతో తన తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లపే కూడా కాస్త ఒత్తిడి పడిందన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఒత్తిడితో కూడుకున్నవని.. అయితే వాటిని అధిగమిస్తే విజయం సాధ్యమవుతుందని అన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లను గెలచి సిరీస్ ను కూడా కైవసం చేసుకున్న ఆతిధ్య జట్టు క్లీన్ స్వీప్ కు ప్రయత్నిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Team India  ODI Series  Mahendra Singh Dhoni  

Other Articles