Dhawan and Kohli perform wrost game in practice match in Australia

Dhawan and kohli perform wrost game in practice match in australia

Dhawan, Kohli, Virat Kohli, Shikhar Dhawan, Indian cricket, Team India, Australia Tour, Australia Vs India

Dhawan and Kohli perform wrost game in practice match in Australia. Indian star batsmen Kohli and Dhawan play very bad game in the second day of practice match.

దావన్ 4, కోహ్లీ 7.. ఇలా అయితే ఆస్ట్రేలియాలో కష్టం

Posted: 01/09/2016 06:31 PM IST
Dhawan and kohli perform wrost game in practice match in australia

ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా సిద్దమవుతోంది. బ్యాటింగ్ లో ఇరగదీసే మన వాళ్లు మరో సారి ఆస్ట్రేలియా గడ్డ మీద సత్తా చాటేందుకు సన్నద్దమవుతున్నారు.  అయితే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ  వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.  ధానవ్ కేవలం 4 రన్స్, కోహ్లీ కేవలం 7 రన్స్ మాత్రమే చేశారు. ఆ తరుణంలో రోహిత్ శర్మ-అజింక్యా రహానేల జోడీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. కాగా, రహానే 41 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తడబడినట్లు కనిపించింది.
 
అయితే  రోహిత్ శర్మ 82 బాల్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 రన్స్ , మనీష్ పాండే 59 బంతుల్లో 3 ఫోర్లతో 58 రన్స్ చేశారు. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించినా, ధోని(15), గుర్కీరత్ సింగ్ (6)లు నిరాశపరిచారు. చివరి వికెట్ గా అశ్విన్ పెవిలియన్ చేరడంతో టీమిండియా 49.1ఓవర్లలో 249 పరుగులకు పరిమితమైంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో డ్ర్యూ పోర్టర్ ఐదు వికెట్లతో ఆకట్టుకోగా, మూర్ హెడ్ కు రెండు, మూడీ, కానోర్లకు తలో వికెట్ లభించింది. మొత్తానికి దావన్, కోహ్లీలాంటి మేటి ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్ లోనే చెత్త పర్ఫామెన్స్ తో అందరిని నిరాశపరిచారు. మరి అసలు మ్యాచుల్లో అయినా మన వాళ్లు అదరగొడతారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhawan  Kohli  Virat Kohli  Shikhar Dhawan  Indian cricket  Team India  Australia Tour  Australia Vs India  

Other Articles