Mohammed Shami gets injured in Australia

Mohammed shami gets injured in australia

Mohammed Shami, Mohammed Shami Injured, Team India, Australia, Kohli, Team India Australia Tour

It seems that the hard times are not yet over for India fast bowler Mohammed Shami. Having just made a comeback to the national side following a nine-month long injury break, Shami has reportedly pulled his hamstring on Friday, throwing his Australia tour in jeopardy. According to a report in The Hindu, the Indian contingent in Australia suffered a major blow after Shami pulled his hamstring on a day when India won the first warm-up T20 against Western Australia XI.

ప్రాక్టీస్ లో మహ్మద్ షమికి గాయాలు

Posted: 01/09/2016 04:16 PM IST
Mohammed shami gets injured in australia

ఆట ఆడకుండానే అప్పుడే అపశకునం అన్నట్లు తయారైంది టీమిండియా పని. మన బౌలర్లు ఇరగదీస్తారు అనుకుంటున్న టైంలో ఆస్ట్రేలియా టూర్ కు అసలు మహ్మద్ షమి సిద్దంగా ఉన్నాడా లేడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మహ్మద్ షమికి గాయాలయ్యాయని తెలుస్తుండటంతో టీమిండియా విజయావకాశాలకు గండిపడినట్లు కనిపిస్తోంది. మన బలం బ్యాటింగ్ అయినా కానీ ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే బౌలింగ్ కూడా అవసరమే అందుకే మహ్మద్ షమిలాంటి ఆటగాడికి గాయం తగలడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసినట్లైంది. ఐదు వన్డేలు, మూడు టెస్టులు ఆస్ట్రేలియా టూర్ లో మొదటి ఎదురుదెబ్బ షమీ రూపంలో తగిలింది.

ఆస్ట్రేలియాతో 12 తేది నుండి ప్రారంభం కానున్న సిరీస్ లో భారత జట్టు సన్నద్దమవుతోంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు చేసిన ఎక్సర్ సైజ్ లో మహ్మద్ షమికి గాయమైంది. తొడ కండరాలు పట్టేయడంతో షమీ ఆ సిరీస్ ఆడతాడా లేదా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ గతంలో ఆస్ట్రేలియాలో చెత్త పర్ఫామెన్స్ ఇవ్వడం.. ఇప్పుడు ఇలా బౌలర్లబలంలో షమి తగ్గిపోవడంపై టీమిండియా బలహీనపడిపోయినట్లు కనిపిస్తోంది. అయితే షమీ లేకపోయినా కానీ అతడి స్థానంలో బుమ్రహను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు షమికి రిప్లేస్ మెంట్ గా ఉంటాడని అనుకుంటున్నారు. మరి చూడాలి షమి మెడికల్ రిపోర్ట్ ను బట్టి అతడు మ్యాచ్ కు ఫిట్ గా ఉన్నాడా లేడా అన్నది తేలుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Shami  Injured  Team India  Australia  

Other Articles